
ఏలూరు జిల్లాలో (eluru district) నాటు తుపాకీ పేలి ఒకరు చనిపోయారు. తీగలపల్లెకి చెందిన ముగ్గురు యువకులు రాత్రి తుపాకీతో కుందేళ్ల వేటకు వెళ్లారు. మట్టి రోడ్డులో వెళ్తూ వుండగా.. తుపాకీ కిందపడి పేలింది. ఈ క్రమంలో బుల్లెట్ కృష్ణ అనే వ్యక్తి తలలోకి దూసుకుపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఇంటి వద్దకు చేర్చిన మరో ఇద్దరు యువకులు పరారీలో వున్నారు. స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.