కరోనా పాజిటివ్ వచ్చిందని.. భయంతో బిల్డింగ్ మీదినుంచి దూకి యువకుడి ఆత్మహత్య..

Published : Jan 19, 2022, 10:51 AM IST
కరోనా పాజిటివ్ వచ్చిందని.. భయంతో బిల్డింగ్ మీదినుంచి దూకి యువకుడి ఆత్మహత్య..

సారాంశం

పరీక్షల్లో అతడికి corona positiveగా నిర్థారణ అయ్యింది. కరోనా భయంతో అతను ఆస్పత్రి బిల్డింగ్ నాలుగో అంతస్తులోని అద్దం పగలగొట్టి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరోనా భయంతోనే విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఘటన మీద కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు వివరించారు. 

కుప్పం : చిత్తూరు జిల్లా కుప్పంలో corona virus భయంతో ఓ యువకుడు భవనం మీదినుంచి దూకి suicide చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 25 వ వార్డు లక్ష్మీ పురానికి చెందిన విజయ్ ఆచారి (30) కుటుంబ కలహాలతో నిన్న రాత్రి పురుగుల మందు తాగాడు. దీంతో అతడిని కుటుంబ సబ్యులు ఓ private hospitalకి తరలించారు. 

అక్కడ నిర్వహించిన పరీక్షల్లో అతడికి corona positiveగా నిర్థారణ అయ్యింది. కరోనా భయంతో అతను ఆస్పత్రి బిల్డింగ్ నాలుగో అంతస్తులోని అద్దం పగలగొట్టి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరోనా భయంతోనే విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఘటన మీద కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు వివరించారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌‌‌లో corona cases భారీగా పెరిగాయి. మంగళవారం నాటి లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 6,996 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 21,14,489కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరులలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 

వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,514కి చేరుకుంది. 24 గంటల్లో కరోనా నుంచి 1,066 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,63,867కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 38,055 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,19,22,969కి చేరుకుంది.

ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 36,108 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 462, చిత్తూరు 1534, తూర్పుగోదావరి 292, గుంటూరు 758, కడప 202, కృష్ణ 326, కర్నూలు 259, నెల్లూరు 246, ప్రకాశం 424, శ్రీకాకుళం 573, విశాఖపట్నం 1263, విజయనగరం 412, పశ్చిమ గోదావరిలలో 245 చొప్పున వైరస్ బారినపడ్డారు. 

మరోవైపు భారత్‌లో గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,38,018  కరోనా కేసుల నమోదయ్యాయి. అయితే గత రెండు రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గడం కొద్దిగా ఊరట కలిగించే అంశమని చెప్పాలి. తాజాగా 310 కరోనాతో మంది మరణించారు. దీంతో కరోనాతో మొత్తం మరణాల సంఖ్య 4,86,761కి చేరింది. నిన్న కరోనా నుంచి 1,57,421 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 3,53,94,882 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,36,628 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 14.43 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు.. 94.09 శాతం, యాక్టివ్ కేసులు.. 4.62 శాతంగా ఉంది. ఇక, శనివారం (జనవరి 15) రోజున దేశంలో 16,49,143 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 70,54,11,425కి చేరినట్టుగా తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్