విజయవాడలో విషాదం.. భర్తతో వాగ్వాదం సీఐడీ సీఐ భార్య ఆత్మహత్య..

Published : Jan 17, 2023, 07:28 AM IST
విజయవాడలో విషాదం.. భర్తతో వాగ్వాదం సీఐడీ సీఐ భార్య ఆత్మహత్య..

సారాంశం

విజయవాడలో ఓ పోలీస్ అధికారి భార్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భర్తతో వాగ్వాదంతో మనస్తాపానికి చెందిన ఆమె ఉరేసుకుని చనిపోయింది.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి భార్య కుటుంబ కలహాలు అనే పద్యంలో ఆత్మహత్య చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సిఐడి సిఐ చంద్రశేఖర్  భార్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విజయవాడ పటమట పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఇలా తెలిపారు. సీఐ చంద్రశేఖర్, ఆయన భార్య జ్యోతి (34), ముగ్గురు పిల్లలు విజయవాడ పటమట తోటవారి వీధిలో ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.  పిల్లలకు భోజనం పెట్టే విషయంలో మధ్యాహ్నం ఒంటి గంటకి  ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఆ తర్వాత సిఐ చంద్రశేఖర్ భోజనం చేసి బయటకు వెళ్లిపోయాడు. వాగ్వాదానికి దిగడంతో జ్యోతి మనస్థాపానికి గురైంది. భర్త వెళ్లిపోగానే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ముగ్గురు పిల్లలు ఏదో ప్రమాదాన్ని శంకించి తలుపులు కొట్టినా తీయలేదు. దీంతో వారు గట్టిగా తలుపులు బాధుతూ.. తలుపులు తీయాలంటూ కేకలు వేశారు. అయినా, గదిలోపలున్న జ్యోతి స్పందించలేదు. పిల్లల ముగ్గురు వెంటనే తండ్రి చంద్రశేఖర్ కు ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు. కంగారుపడిన చంద్రశేఖర్ హుటాహుటిన ఇంటికి వచ్చిచూడగా.. భార్య అప్పటికే ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించింది. విజయవాడ పటమట పోలీసులు దీనిమీద కేసు నమోదు చేసుకున్నారు.

చేతబడి అనుమానం.. అర్థరాత్రి కత్తులు, గొడ్డళ్ళతో దాడి చేసి.. దంపతుల దారుణహత్య..

ఇదిలా ఉండగా, ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య తగాదాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. భార్య ఈగల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఎస్ఐ ఎం.సాగర్ బాబు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఈ విధంగా తెలియజేశారు.. ఎ.పోలవరం గ్రామానికి చెందిన వనపర్తి సతీష్ భార్య ఆత్మహత్య చేసుకుంది. సతీష్ కు అదే గ్రామానికి చెందిన దేవి (20) అనే మహిళతో రెండేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి మూడు నెలల చిన్నారి కూడా ఉంది. 

సతీష్ కూలీ పనులకు వెళ్తుంటాడు. రోజూలాగే ఆరోజు కూడా కూలీ పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి  భోజనానికి వచ్చాడు.  ఆ సమయంలో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. భోజనం చేసిన తర్వాత సతీష్ తిరిగి పనికి వెళ్ళిపోయాడు. ఈ గొడవతో దేవి మనస్థాపం చెందింది. ఇంట్లో ఉన్న ఈగల మందు తాగి  ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అయితే ఇంట్లో ఉన్న దేవి అత్త నిర్మల ఇది గమనించింది. వెంటనే, కుటుంబ సభ్యులతో విషయాన్ని చెప్పి..  జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లింది.

అక్కడ చికిత్స పొందుతూ దేవి మరణించింది. అక్కడ చికిత్స పొందుతూ దేవి మరణించింది ఆమె ఆత్మహత్యపై ఎ. పోలవరానికి చెందిన దేవి సోదరి తమ్మిశెట్టి నాగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేవి సతీష్ లది ప్రేమ వివాహమని చెప్పింది. సతీష్ కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని.. ఈ విషయం తెలియడంతో దేవి సతీష్ ల మధ్య గొడవలు జరుగుతున్నాయని  చెప్పింది. 

ఫోన్ విషయంలో కూడా ఇటీవల గొడవ జరిగిందని.. ఈ గొడవలో సతీష్ తన చెల్లెలు దేవిని కొట్టాడని చెప్పుకు వచ్చింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దేవి ఈగల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, తన చెల్లెలితో సతీస్ బలవంతంగా మందు తాగించాడని కూడా అనుమానంగా ఉందని  ఆమె తెలిపింది. తమ చెల్లి మృతికి న్యాయం జరగాలని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : టమాటా టార్గెట్ సెంచరీ..? మిర్చీ హాఫ్ సెంచరీ..? : హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : చలి తగ్గినా ఈ ప్రమాదం ఇంకా పొంచివుంది.. తస్మాత్ జాగ్రత్త