
కృష్ణా జిల్లా కంకిపాడు పీఎస్ దగ్గర శనివారం ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. అరవింద్ అనే యువకుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అరవింద్ మృతికి పోలీసులే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసుల వేధింపులు, బాబాయ్ భార్య పెడుతున్న ఇబ్బందుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అరవింద్ సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. కోటి, మురళి అనే ఇద్దరు కానిస్టేబుల్స్ తనను వేధించారని సూసైడ్ నోట్‌లో రాశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అరవింద్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.