లంకా దినకర్ మీద సస్పెన్షన్ ఎత్తివేత: సోము వీర్రాజు ఆదేశాలు

By telugu teamFirst Published Jan 27, 2021, 8:30 AM IST
Highlights

గతంలో తమ పార్టీ నాయకుడు లంకా దినకర్ మీద విధించిన సస్పెన్షన్ ను బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎత్తేశారు. పార్టీ నియమాలకు, మార్గదర్సకాలకు అనుగుణంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు.

అమరావతి: తమ పార్టీ నాయకుడు లంకా దినగర్ మీద విధించిన సస్పెన్షన్ ను బిజెపి అధిష్టానం ఎత్తేసింది. గతంలో పార్టీ పంథాకు విరుద్ధంగా మాట్లాడారని ఆరోపిస్తూ బిజెపి నుంచి లంకా దినకర్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.  

లంకా దినకర్ మీద విధించిన సస్పెన్షన్ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని బిజెపి రాష్ట్రాధ్యక్,ుడు సోము వీర్రాజు ఆదేశించారు. భవిష్యత్తులో పార్టీ ఆదేశాలను, మార్గదర్శకాలను పాటించాలని ఆయన లంకా దినకర్ కు సూచించారు. 

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు బిజెపి కార్యాలయం నుంచి దినకర్ కు బిజెపి లేఖను పంపించారు. టీవీ చర్చా కార్యక్రమాల్లో దినకర్ పార్టీ నిర్ణయాలకు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బిజెపి ఆయనను సస్పెండ్ చేసింది. సొంత ఎజెండాపైనే లంకా దినకర్ దృష్టి పెట్టారని ఆరోపిచింది. 

ఆ విషయంపై తొలుత లంకా దినకర్ కు షోకాజ్ నోటీసు జారీ అయింది. షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వకపోవడంతో బిజెపి నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిరుడు అక్టోబర్ లో ఆయన సోము వీర్రాజు ఆదేశాలు జారీ చేశారు. 

బిజెపిలో చేరడానికి ముందు లంకా దినకర్ టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఏపీలో టీడీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన బిజెపిలో చేరారు. 

click me!