ఏలూరులో కలకలం: మహిళను హత్య చేసి సూసైడ్ చేసుకున్న వ్యక్తి

Published : Aug 28, 2023, 04:19 PM ISTUpdated : Aug 28, 2023, 04:23 PM IST
ఏలూరులో కలకలం: మహిళను హత్య చేసి సూసైడ్  చేసుకున్న వ్యక్తి

సారాంశం

ఏలూరులో మహిళను హత్య చేసిన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన  స్థానికంగా కలకలం రేపుతుంది.  

ఏలూరు: జిల్లా కేంద్రంలోని దక్షిణ వీధిలో  మహిళ హత్యకు గురైంది.  మహిళను హత్య చేసిన నిందితుడు  నూజీవీడు  రైల్వేస్టేషన్  వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఏలూరులో జిల్లా కేంద్రంలో  ఓ మహిళ హత్యకు గురైన విషయం  సోమవారంనాడు వెలుగు చూసింది.  నిన్న ఈ మహిళ హత్యకు గురైందని  పోలీసులు అనుమానిస్తున్నారు.  అయితే ఈ మహిళను హత్య  చేసినట్టుగా అనుమానిస్తున్న నిందితుడు నూజీవీడు రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

మహిళను హత్య చేసిన తర్వాత నిందితుడు ఆత్మహత్య చేసుకొన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధమే వీరి ద్దరి మరణానికి కారణంగా  పోలీసులు అనుమానిస్తున్నారు.   ఏలూరులోని సత్యనారాయణ  అనే వ్యక్తి నివాసంలో  ఓ మహిళ  హత్యకు గురైంది.  హత్యకు గురైన  మహిళ సుజాతగా  గుర్తించారు. సత్యనారాయణ అనే వ్యక్తి నూజీవీడు రైల్వేస్టేషన్ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నిన్న  మధ్యాహ్నం  పనిచేసే  దుకాణం నుండి లంచ్ కోసం బయటకు వెళ్లిన సుజాత  కన్పించకుండా పోయింది. ఇవాళ ఉదయం ఆమె  రక్తపు మడుగులో కన్నించడంతో  స్థానికులు షాక్ కు గురౌతున్నారు. నిన్న సాయంత్రం నుండి  సుజాత కోసం  గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదని సుజాత  కుటుంబ సభ్యులు చెప్పారు.  ఈ ఘటనకు సంబంధించి  పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్