సీఎం జగన్‌ చొరవ.. శాంతితో చేతులు కలిపేందుకు మంత్రి రోజా అయిష్టత.. అసలేం జరిగిందంటే..

Published : Aug 28, 2023, 03:36 PM IST
 సీఎం జగన్‌ చొరవ.. శాంతితో చేతులు కలిపేందుకు మంత్రి రోజా అయిష్టత.. అసలేం జరిగిందంటే..

సారాంశం

చిత్తూరు జిల్లా నగరి వైసీపీలో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అయితే ఈ సారి ఏకంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమక్షంలోనే నేతల మధ్య విభేదాలు వెలుగుచూశాయి.

చిత్తూరు జిల్లా నగరి వైసీపీలో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అయితే ఈ సారి ఏకంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమక్షంలోనే నేతల మధ్య విభేదాలు వెలుగుచూశాయి. వివరాలు.. నగరి వైసీపీలో ఓ వర్గం నేతలు మంత్రి రోజాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలసిందే. పలు సందర్భాల్లో ఈ విషయం బహిరంగంగానే వెల్లడైంది. తాజాగా  జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ నగరిలో పర్యటించారు. ఈ సందర్భంగా.. నగరి వైసీపీలో నేతల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. 

మంత్రి రోజా, వైసీపీ కేజే శాంతి చేతులు కలిపేందుకు సీఎం జగన్ యత్నించారు. జగన్‌ చొరవ చూపి ఇరువురి చేతులు కలిపినప్పటికీ.. చేతులు కలిపేందుకు రోజా అయిష్టత చూపారు. వెంటనే తన చేతిని వెనక్కి లాక్కున్నారు. ఆ తర్వాత కేజే శాంతి మాత్రం సీఎం జగన్‌ చేతిని పట్టుకునే ఉన్నారు. స్వయంగా సీఎం జగన్‌ రంగంలోకి దిగి.. నేతల చేతులు కలిపేందుకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాకపోవడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

తెలుగు ప్రజలారా బిఅలర్ట్..ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుల ప్రమాదం | Asianet News Telugu
Rain Alert : తెలుగు ప్రజలారా బిఅలర్ట్.. పిడుగులు, ఈదురుగాలుల వర్షాలతో ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం