సీఈసీతో బాబు భేటీ: ఏపీలో దొంగ ఓట్లపై ఫిర్యాదు

Published : Aug 28, 2023, 03:46 PM IST
 సీఈసీతో  బాబు భేటీ: ఏపీలో దొంగ ఓట్లపై  ఫిర్యాదు

సారాంశం

సీఈసీతో  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  సోమవారంనాడు భేటీ అయ్యారు.

న్యూఢిల్లీ: సీఈసీతో  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు బృందం  సోమవారంనాడు భేటీ అయింది. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై  సీఈసీకి  టీడీపీ బృందం  ఫిర్యాదు చేసింది.

 రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  టీడీపీ సానుభూతిపరుల ఓట్లను  వైసీపీ తొలగిస్తుందని  టీడీపీ ఆరోపిస్తుంది.  దొంగ ఓట్ల విషయమై  తాము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడ పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో  ఓట్ల తొలగింపు అంశానికి సంబంధించి  ఇప్పటికే  స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్  ఈసీకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  ఈసీ అధికారులు  విచారణ నిర్వహించాలని స్థానికంగా  ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ విషయమై  జిల్లా పరిషత్ సీఈఓలుగా పనిచేసిన ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.  

ఇదిలా ఉంటే  చంద్రబాబు నేతృత్వంలో  టీడీపీ బృందం కలిసిన తర్వాత  వైసీపీ నేతృత్వంలో కూడ  ఆ పార్టీ నేతలు  సీఈసీతో భేటీ కానున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్