అక్కాచెల్లెళ్లకు వల: ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధం

Siva Kodati |  
Published : May 12, 2019, 12:06 PM ISTUpdated : May 12, 2019, 12:08 PM IST
అక్కాచెల్లెళ్లకు వల: ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధం

సారాంశం

అక్కాచెల్లెళ్లను ట్రాప్ చేసిన ఓ కేటుగాడు.. ఒకరికి తెలియకుండా మరోకరిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు

అక్కాచెల్లెళ్లను ట్రాప్ చేసిన ఓ కేటుగాడు.. ఒకరికి తెలియకుండా మరోకరిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన బి.హేమంత్ కుమార్‌కు స్థానిక జగ్గయ్య చెరువు కాలనీలో ఉన్న కిరాణాషాపుకు వచ్చే 19 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. అక్కడితో ఆగిపోకుండా ఆమె చెల్లెలితో కూడా ఇదే రకమైన బంధాన్ని ఏర్పరచుకున్నాడు.

ఒకరికి తెలియకుండా మరొకరితో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న సదరు యువతులను తన విషయం బయటపెడితే మీ న్యూడ్ ఫోటోలను నెట్‌లో పెడతానంటూ బెదిరించాడు.

అంతేకాకుండా వాటని తన స్నేహితులకు చూపించాడు. అతని వేధింపులు మితిమీరిపోవడంతో మైనర్ బాలిక ఈ విషయాన్ని తండ్రికి చెబుతానని హెచ్చరించింది. దీంతో హేమంత్ కుమార్ తన స్నేహితులతో కలిసి ఆమెపై బ్లేడ్‌తో దాడి చేయడంతో ఆమెకు గాయాలయ్యాయి.

ఈ విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు హేమంత్ కుమార్‌తో పాటు అతని స్నేహితులు అనిరుధ్ రెడ్డి, ప్రశాంత్‌లతో పాటు ఇద్దరు యువతులపైనా కేసులు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu