ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేశాడో యువకుడు. చివరికి ఆమె గర్భం దాల్చిన తరువాత వేరే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు.
కర్నూలు : ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పట్టణానికి చెందిన మోహన్ ఉరఫ్ యోహానుపై ఓ యువతి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. నాలుగు సంవత్సరాలుగా తాము ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటామని నమ్మించి గర్భవతిని చేశాడని తెలిపింది. ఆ తరువాత గర్భం తీయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని నమ్మించి బలవంతంగా టాబ్లెట్లు మింగించి గర్బస్రావం చేయించాడని, చివరికి వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని పేర్కొంది.
నమ్మించి మోసం చేసిన తన ప్రియుడిని, వేరే అమ్మాయితో పెళ్లికి ప్రేరేపిస్తున్న అతడి కుటుంబసభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు ఆమె ప్రియుడు మోహన్, అతనికి సహకరిస్తున్న ముగ్గురి మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపారు.
ఇలాంటి ఘటన హైదరాబాద్ లో గత ఎప్రిల్ లో వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడికి రిమాండ్ తరలించిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాప్రా గాంధీనగర్కు చెందిన గడ్డం కార్తీక్(24), అదే కాలనీకి చెందిన ఓ యువతి(21), కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. దీంతో యువతి తనను వివాహం చేసుకోవాలని పలుమార్లు ఒత్తిడి చేస్తుండడంతో తప్పించుకుని తిరుగుతున్నాడు.
ట్రెజరీ మాజీ ఉద్యోగి మనోజ్ అక్రమాల కేసులో కొత్త ట్విస్ట్.. ప్లాన్ బెడిసికొట్టింది..
ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలవడంతో కార్తీక్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈనెల 8న వివాహం చేస్తానని వారంతా ఒప్పుకున్నారు. తీరా మరుసటిరోజే ఇంటికి తాళం వేసుకుని పరారయ్యారు. కార్తీక్, అతడి కుటుంబసభ్యుల ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు కాపాడారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా కార్తీక్ ను శనివారం అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
ఇదిలా ఉండగా, నిరుడు సెప్టెంబర్ లో వేములవాడలో ఇలాంటి ఘటనలో యువతి ప్రేమికుడి ఇంటిముందు బైఠాయించింది. రెండేళ్లుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు మోసం చేశాడని ఓ యువతి మేనబావ ఇంటి ఎదుట బైఠాయించిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్ చెందిన తన మేనబావ ఎదురు గట్ల రాము అదే కాలనీలో నివసిస్తున్న తన మేనమామ కూతురు గౌతమి ప్రేమిస్తున్నానని చెప్పాడు.
రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించాడని ఆ యువతి వాపోయింది. తన తల్లి మాటలు విని తప్పించుకు తిరుగుతున్నాడని గౌతమి ఆవేదన చెందింది. ఈ విషయమై నాలుగు రోజుల కిందట గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ వెంకటేష్ ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయినా రాము మారకపోవడంతో ఘటన జరిగిన రోజు ఉదయం ఈ విషయమై గౌతమి అడిగేందుకు వెళ్లడంతో ఇంటికి తాళం వేసి తల్లి కొడుకు ఇద్దరూ వెళ్లిపోయారు అని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని బాధితులు ఇంటి ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసింది.