ఆటో డ్రైవర్ తో గొడవ.. చెవి కొరికేసి..

Published : Sep 08, 2021, 09:14 AM IST
ఆటో డ్రైవర్ తో గొడవ.. చెవి కొరికేసి..

సారాంశం

ప్రయాణికులతో మంగళవారం గిద్దలూరు వచ్చిన వారు తిరిగి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు సీరియల్‌ విషయంలో గొడవపడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు

ఓ ఆటో డ్రైవర్ మరో ఆటో డ్రైవర్ తో గొడవ పడ్డాడు. గొడవపడి అతడి చెవి కొరికేశాడు. దీంతో చెవి పూర్తిగా తెగి కిందపడిపోయింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకుంటపల్లెలో జరిగింది. పొదలకుంటపల్లెకు చెందిన కాల్వ భాస్కర్, తాటిచర్ల వెంకటేశ్వర్లు ఇద్దరూ వారి గ్రామం నుంచి గిద్దలూరు వరకు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.

ప్రయాణికులతో మంగళవారం గిద్దలూరు వచ్చిన వారు తిరిగి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు సీరియల్‌ విషయంలో గొడవపడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘర్షణలో భాస్కర్‌ చెవిని వెంకటేశ్వర్లు కొరికేయడంతో చెవి తెగి కిందపడిపోయింది. తీవ్ర రక్తస్రావమైన భాస్కర్‌ను ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?