బిడ్డను స్కూల్ నుంచి తీసుకెళ్తుండగా .. దూసుకొచ్చిన మృత్యువు, తల్లీకూతుళ్లు దుర్మరణం

Siva Kodati |  
Published : Sep 14, 2021, 05:34 PM IST
బిడ్డను స్కూల్ నుంచి తీసుకెళ్తుండగా .. దూసుకొచ్చిన మృత్యువు, తల్లీకూతుళ్లు దుర్మరణం

సారాంశం

గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో లారీ బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న తల్లీకూతుళ్ల మీదకు వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూతురు షేక్ అప్సాతో పాటు షేక్ హసీనా అక్కడికక్కడే మృతిచెందారు.

గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో లారీ బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న తల్లీకూతుళ్ల మీదకు వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూతురు షేక్ అప్సాతో పాటు షేక్ హసీనా అక్కడికక్కడే మృతిచెందారు. కుమార్తెను తల్లి స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా మార్కెట్ యార్డ్‌లో లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. లారీ మితిమిరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu