కొత్తగా 1,125 మందికి పాజిటివ్.. చిత్తూరులో తీవ్రత, ఏపీలో 20,29,079కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Sep 14, 2021, 05:45 PM IST
కొత్తగా 1,125 మందికి పాజిటివ్.. చిత్తూరులో తీవ్రత, ఏపీలో 20,29,079కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 1,125 కరోనా కేసులు నమోదవ్వగా.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,356 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,412 మంది చికిత్స పొందుతున్నారు  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,125 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,29,079కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,019కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల నెల్లూరు 1, కృష్ణ 3, ప్రకాశం 1, తూర్పుగోదావరి 1, గుంటూరు 1, పశ్చిమ గోదావరిలలో ఇద్దరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,356 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,00,648కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 49,568 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,74,13,209కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,412 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 16, చిత్తూరు 210, తూర్పుగోదావరి 62, గుంటూరు 81, కడప 48, కృష్ణ 164, కర్నూలు 1, నెల్లూరు 184, ప్రకాశం 110, శ్రీకాకుళం 27, విశాఖపట్నం 54, విజయనగరం 7, పశ్చిమ గోదావరిలలో 161 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Powerful Speech: యోగా దినోత్సవంలో చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
Weather Update: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు