చంపేస్తానని బెదిరించి.. బాలికపై లైంగికదాడి.. నగ్నచిత్రాలు తీసి... !!

Published : Mar 24, 2021, 09:43 AM IST
చంపేస్తానని బెదిరించి.. బాలికపై లైంగికదాడి.. నగ్నచిత్రాలు తీసి... !!

సారాంశం

బాలికపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. ఆ తరువాత బెదిరింపులకు పాల్పడిన నిందితుడు, అతడికి సహకరించిన స్నేహితులపై పోలీసులు పోక్సో, దిశ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అమలాపురంలో చోటుచేసుకుంది. 

బాలికపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. ఆ తరువాత బెదిరింపులకు పాల్పడిన నిందితుడు, అతడికి సహకరించిన స్నేహితులపై పోలీసులు పోక్సో, దిశ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అమలాపురంలో చోటుచేసుకుంది. 

అమలాపురం ప్రాంతానికి చెందిన 17 యేళ్ల బాలిక పోటీ పరీక్షల ట్రైనింగ్ కోసం గతంలో రాజమహేంద్రవరం వెళ్లింది. అక్కడ ఓ కాలేజీలో ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ చదువుతున్న పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన మణి వెంకట సత్యనారాయణతో పరిచయమైంది. 

గతేడాది అక్టోబర్ 31న అమలాపురం వచ్చిన అతను ఒక లాడ్టీలో వారంపాటు మకాం వేసి బాలికను గుడికి రప్పించి మాట్లాడాడు. తన కోరిక తీర్చకపోతే ఇంట్లో వాళ్లను చంపేస్తానని బెదిరించి, భయపెట్టాడు. అలా ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, ఆమె నగ్న చిత్రాలు తీశాడు. 

ఆ తరువాత వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె మానసికంగా కృంగిపోయింది. విషయం తెలుసుకున్న ఆమ తల్లిదండ్రులు కొవ్వూరులోని యువకుడి ఇంటికి వెళ్లి నిలదీశారు. 

అయినా యువకుడిలో మార్పు రాకపోవడంతో ఈ నెల 12న రాజానగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కేసును అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ కు బదలాయించారు. దీనిమీద కాకినాడ దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నట్లు స్టేషన్ ఇంచార్జ్, రూరల్ సీఐ సురేష్ బాబు మంగళవారం తెలిపారు. 

నిందితుడికి సహకరించిన 15 మంది స్నేహితులపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపరు. వీరిలో ఇద్దరు విద్యార్థినులు కూడా ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu & Minister Nara Lokesh: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు | Asianet News Telugu
CM Chandrababu Naidu: సీఎం తోనే చిన్నారి పంచ్ లు పడిపడి నవ్విన చంద్రబాబు| Asianet News Telugu