బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన సీఐ..! (వీడియో)

Published : Mar 24, 2021, 09:28 AM ISTUpdated : Mar 24, 2021, 09:48 AM IST
బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన సీఐ..! (వీడియో)

సారాంశం

 తన స్నేహితులతో కలసి బ్యాడ్మింటన్‌ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు

బ్యాడ్మింటన్ సరదా ఓ పోలీసు అధికారి ప్రాణాలు తీసింది. స్నేహితులతో కలిసి సరదాగా బ్యాడ్మింటన్ ఆడుతూ.. అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకోగా...  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గణపవరం సీఐ డేగల భగవాన్‌ ప్రసాద్‌(42) గుండెపోటుతో మరణించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో తన స్నేహితులతో కలసి బ్యాడ్మింటన్‌ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే వాసుబాబు సోదరుడు కార్తీక్‌ వెంటనే ఆయనను అంబులెన్స్‌లో గణపవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి పీహెచ్‌సీకి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మరణించినట్లు తెలిపారు.


ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తూర్పుగోదావరి కరప మండలం పెద్దాపురప్పాడు గ్రామానికి చెందిన భగవాన్‌ప్రసాద్‌ 2003లో కానిస్టేబుల్‌గా పోలీస్‌శాఖలో చేరి, 2007లో ఆర్‌ఎస్‌ఐగా, 2009లో  సివిల్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. నాలుగేళ్ల క్రితం సీఐగా ప్రమోషన్‌ పొందారు. సీఐ మృతదేహాన్ని ఎమ్మెల్యే వాసుబాబు సందర్శించి నివాళులర్పించారు.  
"

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్