విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: కేంద్రానికి ఏపీ హైకోర్టు నోటీసులు

Published : Apr 15, 2021, 12:31 PM IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: కేంద్రానికి ఏపీ హైకోర్టు నోటీసులు

సారాంశం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వానికి  కౌంటర్ దాఖలు చేయాలని  ఏపీ హైకోర్టు  గురువారం నాడు ఆదేశించింది.

విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వానికి  కౌంటర్ దాఖలు చేయాలని  ఏపీ హైకోర్టు  గురువారం నాడు ఆదేశించింది.విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను నిరసిస్తూ  ఏపీ హైకోర్టులో  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై  గురువారం నాడు విచారణ జరిపిన హైకోర్టు  కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని తాము కేంద్రాన్ని కోరినట్టుగా ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని  కేంద్రం నిర్ణయం తీసుకొంది.  అయితే ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు, ఉద్యోగులు విశాఖలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తున్నారు.స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని ప్రత్యామ్నాయాలను కూడ సూచిస్తూ ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. అంతేకాదు ఈ విషయమై  అఖిలపక్షంతో పాటు  స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులతో  సమావేశానికి అపాయింట్ మెంట్ ఇవ్వాలని కూడా లేఖ రాశారు. 
 

PREV
click me!

Recommended Stories

Kondapalli Srinivas: చెప్పిన టైం కంటే ముందే పూర్తి చేశాం మంత్రి కొండపల్లి శ్రీనివాస్| Asianet Telugu
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్ పోర్ట్ లో రామ్మోహన్ నాయుడు స్పీచ్| Asianet Telugu