మచిలీపట్నం వైసిపి నేత హత్య కేసు... ముగ్గురు నిందితుల అరెస్ట్

By Arun Kumar PFirst Published Jun 30, 2020, 11:36 AM IST
Highlights

రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, వైసిపి నాయకులు మోకా భాస్కరరావు హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. 

మచిలీపట్నం: రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, వైసిపి నాయకులు మోకా భాస్కరరావు హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. హత్యలో పాల్గొన్న నలుగురు వ్యక్తులను సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించి తాజాగా వారిని అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులు పులి, కిశోర్, చిన్నిలను పోలీసులు అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు. 

హత్య చేసిన అనంతరం ఓ నిందితుడు బైక్ పై పరారవుతుండగా సీసీ కెమెరాలకు చిక్కారు. రోడ్డుపై సిద్ధంగా ఉన్న బైక్ ఎక్కి పరారయ్యాడు ఓ నిందితుడు. ఇలా నగరంలోని వివిధ సిసి టివి పుటేజిని సేకరించిన పోలీసులు నలుగురు నిందితులను గుర్తించారు. వీరి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 

భాస్కరరావు ఛాతీలో పొడిచిన ఒకే ఒక్క పోటు బలంగా దిగడంతో  గుండెకు బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. నేరుగా గుండెకు గాయం కావటంతోనే భాస్కర రావు ప్రాణాలు విడిచారు. 

read more  ముఖ్య అనుచరుడి దారుణ హత్య... మృతదేహం వద్ద బోరున విలపించిన మంత్రి నాని (వీడియో)
 
మంత్రి పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చిన తొలి నుండి ఆయనతోనే వుంటూ ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకున్నారు భాస్కరరావు. అటువంటి అత్యంత సన్నిహితుడి దారుణ హత్య విషయం తెలుసుకుని మంత్రి చలించిపోయారు. తన హోదాను సైతం మరిచిపోయి బాగా ఎమోషన్ అయ్యారు. కృష్ణా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు ఈ హత్య ఎలా జరిగిందో మంత్రికి వివరించారు. 

మచిలీపట్నంలోనే భాస్కర రావుపై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి పారిపోయారు. ఇలా రక్తపు మడుగులో పడిపోయిన ఆయనను వెంటనే  ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. గుండెపై బలమైన గాయం కావడంతో ఆయన మృత్యువాత పడ్డట్లు డాక్టర్లు తెలిపారు. 

భాస్కర రావు హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా టీడీపీ నేత చిన్నిని పోలీసులు అనుమానిస్తున్నారు. భాస్కర రావుపై దాడి ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. సీసీటీవి కెమెరా దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేశారు. భాస్కర రావుపై దాడి జరిగిన తర్వాత చిన్ని ఇంటికి తాళం వేసి పరారయ్యాడు, 

పాతకక్షలే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. 2013లో జరిగిన సురేంద్ర హత్య కేసులో భాస్కర రావు నిందితుడని తెలుస్తోంది. ఆ కారణంగానే భాస్కర రావు హత్యకు గురయ్యాడని అంటున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  

click me!