మచిలీపట్నంలో కలకలం... విధుల్లో చేరిన నాలుగోరోజే సీఐ మిస్సింగ్

By Arun Kumar PFirst Published Jun 26, 2022, 1:50 PM IST
Highlights

విజయవాడ నుండి మచిలీపట్నంకు బదిలీఅయిన ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ గత ఐదురోజులుగా అటు ఇంటికివెెళ్ళక, ఇటు విధులకు హాజరుకాకుండా అదృశ్యమయ్యారు. 

మచిలీపట్నం : కృష్ణా జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారి అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. మచిలీపట్నం ట్రాఫిక్‌ సీఐగా బాధ్యతలు స్వీకరించిన బాలరాజాజీ నాలుగు రోజులు కూడా గడవకముందే కనిపించకుండా పోవడంతో అటు పోలీస్ శాఖలోనూ, ఇటు బాధిత కుటుంబంలోనూ ఆందోళన మొదలయ్యింది. 

ఇదివరకు విజయవాడలో విధులు నిర్వహించిన బాలరాజాజీ ఇటీవలే బదిలీపై మచిలీపట్నం ట్రాఫిక్ సీఐగా నియమితులయ్యారు. ఈ నెల (జూన్) 16 వ తేదీనే ఆయన బాధ్యతలు చేపట్టారు. నాలుగురోజులు అంటే జూన్ 20 దరకు విధులకు హాజరైన ఆయన ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఎలాంటి సమాచారం లేకుండానే గత ఐదురోజులుగా ఆయన విధులకు హాజరుకావడం లేదు. 

20వ తేదీన స్నేహితుడి పల్సర్ బైక్ తీసుకుని వెళ్లిన రాజాజీ ఇప్పటివరకు తిరిగిరాలేదు. ఆయనను ఎవరైనా కిడ్నాప్ చేసారా? లేదా ఇష్టపూర్వకంగానే ఎక్కడికైనా వెళ్లారా?  లేదా ఏదయినా ప్రమాదం జరిగిందా? అన్నది తెలియాల్సి వుంది. పోలీసులు బాలరాజాజీ ఆఛూకీ కోసం గాలిస్తున్నారు.

అయితే కుటుంబ కలహాలే మచిలీపట్నం ట్రాఫిక్ సీఐ మిస్సింగ్ కి కారణంగా తెలుస్తోంది. బాలరాజాజీ కి దైవభక్తి ఎక్కువ కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ఏదయినా ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్లివుండవచ్చని అనుమానిస్తున్నారు. బాలరాజాజీ అదృశ్యంతో ఆయన కుటుంబసభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

కానీ బాలరాజాజీ అదృశ్యంతో ఆయన కుటుంబసభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత కొంతకాలంగా తీవ్రమైన పనిఒత్తిడితో బాధపడుతున్న సిఐ బదిలీపై అసంతృప్తిగా ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన అదృశ్యానికి కుటుంబ కలహాలేమీ కారణం కాదని సీఐ కుటుంబసభ్యులు చెబుతున్నారు. 


 

click me!