మంత్రులు,అగ్రనేతలు ప్రచారం చేసినా ఆశించిన మెజారిటీ రాలేదు: ఆత్మకూరు ఫలితాలపై బీజేపీ అభ్యర్ధి భరత్

By narsimha lode  |  First Published Jun 26, 2022, 1:32 PM IST

మంత్రులు, ఎమ్మెల్యేలు, అగ్రనేతలు ప్రచారం చేసినా కూడా వైసీపీకి ఆశించిన మెజారిటీ దక్కలేదని బీజేపీ నేత భరత్ కుమార్ చెప్పారు.ఎన్ని అడ్డదారులు తొక్కినా కూడా వైసీపీకి ఆశించిన మెజారిటీ రాలేదన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భరత్ కుమార్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.


నెల్లూరు: మంత్రులు, ఎమ్మెల్యేలు, అగ్ర నేతలు ప్రచారం చేసినా కూడా వైసీపీ ఆశించిన మెజారిటీ దక్కించుకోలేదని ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా  పోటీ చేసి ఓటమి పాలైన  భరత్ కుమార్ విమర్శించారు.

atmakur bypoll results 2022 ఎన్నికల పలితాలు వెల్లడైన తర్వాత  కౌంటింగ్ కేంద్రం వద్ద BJP  అభ్యర్ధి Bharath kumar మీడియాతో మాట్లాడారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో YCP అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు.వలంటీర్లు, ఆశా వర్కర్లు ఓటర్లకు డబ్బులు పంచారని ఆయన ఆరోపించారు. ఎన్ని అడ్డదారులు తొక్కినా కూడా వైసీపీకి ఆశించిన మెజారిటీ దక్కలేదని ఆయన  చెప్పారు. ప్రభుత్వం జీతం తీసుకుంటూ వలంటీర్లు వైసీపీకి ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు.ఈ విషయమై ఏం చేయాలనే దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకొంటామన్నారు.

Latest Videos

undefined

Also read:ప్రజల మద్దతుతోనే భారీ మెజారిటీ: ఆత్మకూరులో విజయం తర్వాత మేకపాటి విక్రంరెడ్డి

వైసీపీ అభ్యర్ధి విక్రమ్ రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి Bharath kumar ‌కు 19,352‌ ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తొలి రౌండ్ నుండి వైసీపీ అభ్యర్ధి విక్రం రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగారు.  తన సమీప ప్రత్యర్థి భరత్ కుమార్ పై 82, 888 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. 

ఈ ఏడాది జూన్ 23 ఆత్మకూర్ లో ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరిగింది. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఉపఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. గత 2019 ఎన్నికల్లో ఆత్మకూర్‌లో 83.32శాతం ఓట్లు పోలయ్యాయి. ఈసారి 64.14శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. ఈ ఉపఎన్నికలో టీడీపీ  పోటీ చేయలేదు. బీజేపీ,,  బీఎస్పీ లను బరిలోకి దింపాయి. ఈ రెండు పార్టీలతో పాటు మరో పది మందికిపైగా ఇండిపెండెంట్లు కూడా బరిలో నిలిచారు. 
మరణించిన ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులను ఎన్నికల బరిలో నిలిపిన సమయంలో పోటీకి నిలపకూడదని గతం నుండి వస్తున్న సంప్రదాయం మేరకు ఆత్మకూరు ఉప ఎన్నికకు దూరంగా ఉన్నామని టీడీపీ నేతలు ప్రకటించారు. గతంలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీకి దూరంగా నిలిచిన విషయం తెలిసిందే. 

ఈ ఏడాది ఫిబ్రవరి 21న గుండెపోటుతో  మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణించాడు.  హైద్రాబాద్ లోని తన నివాసంలో మేకపాటి గౌతం రెడ్డి గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. దీంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ ఆరోపణలు చేసింది. ఎన్నికల్లో అన్ని రకాలుగా అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసిందని బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ ఆరోపించారు. వలంటీర్లు వైసీపీ కూడా ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు.ఈ విషయమై ఏం చేయాలనే దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. 

click me!