మచిలీపట్నం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

Siva Kodati |  
Published : Mar 05, 2024, 09:35 PM ISTUpdated : Mar 07, 2024, 05:04 PM IST
మచిలీపట్నం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

స్వాతంత్ర్య ఉద్యమానికి బందరు పట్టుగొమ్మ.  చారిత్రక గుర్తింపుతో పాటు వందల ఏళ్ల నుంచి వర్తక కేంద్రంగా ఈ పట్టణం విరాజిల్లులోంది. పింగళి వెంకయ్య, కాశీనాథునీ నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, రఘుపతి వెంకయ్య, ఎన్టీఆర్ వంటి మహనీయులు పుట్టిన గడ్డ మచిలీపట్నం. విలక్షణ తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా మచిలీపట్నాన్ని నిలబెట్టారు ఇక్కడి ఓటర్లు. 

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో మచిలీపట్నం ఒకటి. ఉమ్మడి కృష్ణా జిల్లాకు రాజధాని అయిన ఈ నగరం .. బ్రిటీష్ కాలం నుంచి నేటి వరకు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమానికి బందరు పట్టుగొమ్మ. పింగళి వెంకయ్య, కాశీనాథునీ నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, రఘుపతి వెంకయ్య, ఎన్టీఆర్ వంటి మహనీయులు పుట్టిన గడ్డ మచిలీపట్నం.

చారిత్రక గుర్తింపుతో పాటు వందల ఏళ్ల నుంచి వర్తక కేంద్రంగా ఈ పట్టణం విరాజిల్లులోంది. రాజకీయ ఉద్ధండులు మోటూరు హనుమంతరావు, మండలి వెంకటకృష్ణారావు, వడ్డే శోభనాధ్రీశ్వరరావు, కావూరు సాంబశివరావు, అంబటి బ్రాహ్మణయ్య, బూరగడ్డ నిరంజన్ రావు వంటి వారిని గెలిపించి .. ఓడించారు బందరు ప్రజలు. అలాంటి విలక్షణ తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా మచిలీపట్నాన్ని నిలబెట్టారు. 

మచిలీపట్నం ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. తొలినాళ్లలో కాంగ్రెస్‌కు కంచుకోట:

1952 నుంచి 2019 వరకు 17 సార్లు మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ 5 సార్లు, సీపీఐ, వైసీపీలు ఒకసారి విజయం సాధించాయి. ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. కాపు , కమ్మ, బీసీ సామాజికవర్గ ప్రాబల్యం ఇక్కడ ఎక్కువ. బందరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు అసెంబ్లీ స్థానాలున్నాయి. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడింట్లో ఆరు స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. 

మచిలీపట్నంలో మొత్తం ఓటర్ల సంఖ్య 14,73,347. వీరిలో పురుష ఓటర్లు 7,51,716 మంది, మహిళా ఓటర్లు 7,21,530 మంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 12,44,570 మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. 84.47 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ ఎస్సీ ఓటర్ల సంఖ్య 2,91,623 మంది.. ఎస్టీ ఓటర్ల సంఖ్య 32,403.. రూరల్ ఓటర్లు 10,11,844 మంది .. అర్బన్ ఓటర్ల సంఖ్య 4,61,000 మంది. ఈ నియోజకవర్గం ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో విస్తరించి వుంది. బందరు లోక్‌సభ పరిధిలో 1757 పోలింగ్ స్టేషన్లు వున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ బందరులో తొలిసారిగా విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరీకి 5,71,436 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి కొనకళ్ల నారాయణ రావుకు 5,11,295 ఓట్లు.. జనసేన అభ్యర్ధి బండ్రెడ్డి రాముకి 1,13,292 ఓట్లు పోలయ్యాయి. దీంతో వైసీపీ ఇక్కడ 60,141 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించింది. 

మచిలీపట్నం ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో ఎవరుండొచ్చు : 

2024 లోక్‌సభ ఎన్నికలకు గాను మచిలీపట్నం నుంచి వైసీపీ అభ్యర్ధిగా సింహాద్రి రమేశ్‌ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరీ జనసేనలో చేరడంతో ఇక్కడ అభ్యర్ధిని జగన్ మార్చారు. తొలుత బందరు పార్లమెంట్ స్థానానికి మాజీ మంత్రి , ఎమ్మెల్యే పేర్ని నానిని బరిలో దించాలని జగన్ భావించారు. అయితే ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని కుమారుడు కిట్టుని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో సింహాద్రి రమేశ్ బాబుకు టికెట్ దక్కింది. కానీ .. ఒకవేళ టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ కనుక వైసీపీలో చేరితే.. బందరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే.. పొత్తులో జనసేన ఈ సీటును కోరడంతో వల్లభనేని బాలశౌరీ తిరిగి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం