బాపట్ల లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

Siva Kodati |  
Published : Mar 05, 2024, 07:59 PM ISTUpdated : Mar 07, 2024, 05:05 PM IST
బాపట్ల లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

గుంటూరు - ప్రకాశం జిల్లాల పరిధిలో విస్తరించి వుంది బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం. కాకలు తీరిన రాజకీయ యోధులు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ బాపట్ల ప్రాంతం కీలక పాత్ర పోషించింది. సినీ ప్రముఖులు, మాజీ సివిల్ సర్వెంట్లు కూడా ఇక్కడ ఎంపీలుగా గెలుపొందారు. 1977 నుంచి నేటివరకు బాపట్లలో కాంగ్రెస్ 6 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. తొలినాళ్లలో జనరల్ స్థానంగా వున్న బాపట్లను 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎస్సీలకు కేటాయించారు. 

గుంటూరు - ప్రకాశం జిల్లాల పరిధిలో విస్తరించి వుంది బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం. కాకలు తీరిన రాజకీయ యోధులు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. స్వాతంత్ర్య ఉద్యమంలోనూ బాపట్ల ప్రాంతం కీలక పాత్ర పోషించింది. రాజకీయ చైతన్యం ఎక్కువగా వుండే ఈ నియోజకవర్గంలో తొలి నుంచి కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ల ప్రాబల్యం ఎక్కువ. లెఫ్ట్ పార్టీల ప్రభ మసకబారిన తర్వాత కాంగ్రెస్ , టీడీపీలు రాజకీయ ప్రత్యర్ధులుగా మారాయి.

1977 నుంచి బాపట్లలో కాంగ్రెస్ 6 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. సినీ ప్రముఖులు, మాజీ సివిల్ సర్వెంట్లు కూడా ఇక్కడ ఎంపీలుగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం, వైసీపీ మధ్య యుద్ధం మొదలైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ విజయం సాధించగా.. 2019లో వైసీపీ బాపట్లలో జెండా పాతింది. కమ్మ, కాపు, బీసీ, దళిత సామాజిక వర్గాల ఆధిపత్యం ఈ నియోజకవర్గంలో వుంది. తొలినాళ్లలో జనరల్ స్థానంగా వున్న బాపట్లను 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎస్సీలకు కేటాయించారు. 

బాపట్ల ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ-వైసీపీ మధ్య ఆసక్తికర పోరు :

బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలో వేమూరు, రేపల్లే, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ పార్లమెంట్ స్థానంలో 2019 నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 14,68,671... వీరిలో పురుష ఓటర్లు 7,45,927 మంది, మహిళా ఓటర్లు 7,22,659 మంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి నందిగం సురేష్ విజయం సాధించారు. వైసీపీకి 5,98,257 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్ధి మాల్యాద్రి శ్రీరామ్‌కు 5,82,192 ఓట్లు , బీఎస్పీ అభ్యర్ధి కే దేవానంద్‌కు 42,580 ఓట్లు పోలయ్యాయి. దీంతో నందిగం సురేష్ 16,065 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బాపట్ల పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లే, పర్చూరు, చీరాల, అద్దంకిలలో టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించగా.. వేమూరు, బాపట్ల, సంతనూతలపాడులలో వైసీపీ గెలిచింది. అయినప్పటికీ జగన్ పార్టీ ఈ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

బాపట్ల ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024.. బరిలో ఎవరుండొచ్చు : 

సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్‌పై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎంపీగా గెలిచినప్పటికీ ఆయన బాపట్లలో కంటే తాడేపల్లిలోనే ఎక్కువగా కనిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2024లోనూ సురేష్‌కు జగన్ మరోసారి ఛాన్స్ ఇచ్ఛే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేనిపక్షంలో మాజీ హోంమంత్రి సుచరిత భర్త దయాసాగర్ పేరు కూడా వినిపిస్తోంది.

టీడీపీ విషయానికి వస్తే.. జడ శ్రవణ్ కుమార్, మాజీ ఎంపీ సలకల బెంజిమెన్ కుమారుడు రాజశేఖర్, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీల పేర్లు వినిపిస్తున్నాయి.  మరోవైపు.. టీడీపీ, జనసేనలు ప్రస్తుతం పొత్తులో వుండగా.. బీజేపీ కూడా కూటమిలోకి వచ్చే అవకాశం వుండటంతో చివరి నిమిషం వరకు అభ్యర్ధి ఎవరన్నది సస్పెన్స్‌గానే వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jana Sena 13th Formation Day: వినూత్నంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు| Asianet News Telugu
AP Food Commission Chairman: ఉప్మాలో పురుగులు ఫిర్యాదు చేసిన పేరెంట్స్| Asianet News Telugu