ట్విస్ట్: సాయి సాత్విక్‌ది హత్య కాదని తేల్చిన పోలీసులు

By narsimha lodeFirst Published Apr 25, 2019, 5:53 PM IST
Highlights

గుంటూరు జిల్లా మాచర్లలో సాయి సాత్విక్ అలియాస్ సిద్దూను హత్యచేశారనే వార్తలో నిజం లేదని డీఎస్పీ శ్రీహరి స్పష్టం చేశారు. ఆడుకొంటూ ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి సిద్దూ మృతి చెందారని  ఆయన చెప్పారు.

మాచర్ల:గుంటూరు జిల్లా మాచర్లలో సాయి సాత్విక్ అలియాస్ సిద్దూను హత్యచేశారనే వార్తలో నిజం లేదని డీఎస్పీ శ్రీహరి స్పష్టం చేశారు. ఆడుకొంటూ ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి సిద్దూ మృతి చెందారని  ఆయన చెప్పారు.

మాచర్లలో సాయి సాత్విక్ కన్పించడం లేదని ఫిర్యాదు అందిన వెంటనే గుంటూరు రైల్వే స్టేషన్‌లో వెతికే క్రమంలో సాత్విక్ పోలికలతో కూడిన బాలుడు కన్పించాడన్నారు. అయితే ఆ దృశ్యాలను చూసిన తల్లిదండ్రులు సాయి సాత్విక్‌ది కాదని తేల్చారని ఆయన వివరించారు.

నెహ్రునగర్‎లో నివశిస్తున్న వెంకటేశ్వర నాయిక్, సరోజ దంపతుల కుమారుడు సాయి సాత్విక్ సిద్దూ ఈ నెల 22న తన ఇంటి సమీపంలోని ప్రభుత్వం యూపీ స్కూల్లో ఆడుకున్నాడు.స్నేహితులందరూ తిరిగి వెళ్లినా సాయి సాత్విక్ ఇంటికి వెళ్లలేదు. దీనిపై పోలీసులకు పిర్యాదు చేశారు.

మాచర్లలో సాయి సాత్విక్‌ను కిడ్నీప్ చేసి హత్య చేశారనే వార్తలో నిజం లేదని డీఎస్పీ శ్రీహరి తెలిపారు. బాలుడు కనిపించడంలేదని తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమై గుంటూరు రైల్వే స్టేషన్‌లో వెతికే క్రమంలో బాలుడు పోలికలతో ఉన్న సీసీ పూటేజి పరిశీలించామని అన్నారు. అయితే అది సాయి సాత్విక్ కాదని బాలుడు తల్లిదండ్రులు నిర్దారించినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తూ క్వారీ గుంతలో పడి బాలుడు మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు.

గురువారం ఉదయం ఇంటికి సమీపంలోని క్వారీ గుంతలో స్వాత్విక్ శవమై తేలాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు దుస్తులు ఆధారంగా సాత్వికేనని నిర్ధారించారు. బాలుడిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఆడుకుంటూ ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడిపోయాడని పోలీసులు తెలిపారు. బాలుడు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

 

సంబంధిత వార్తలు

కిడ్నాపైన ఆరేళ్ల చిన్నారి సిద్దూ దారుణ హత్య
 

click me!