మా నాన్నని కూడా భేటీకి పిలిచారు.. ఆ ఆహ్వానం చేరనివ్వలేదు, ఎవరి పనో తెలుసు: మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 15, 2022, 04:27 PM ISTUpdated : Feb 15, 2022, 04:34 PM IST
మా నాన్నని కూడా భేటీకి పిలిచారు.. ఆ ఆహ్వానం చేరనివ్వలేదు, ఎవరి పనో తెలుసు: మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

సారాంశం

సీఎంతో భేటీకి మా నాన్నను కూడా ప్రభుత్వం ఆహ్వానించిందని.. కానీ కొందరు దానిని మోహన్‌బాబుకు (mohan babu) చేరనివ్వలేదని మా అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆహ్వానం చేరకుండా ఎవరు చేశారో తమకు తెలుసునంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు

సినిమా రంగ సమస్యలకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో (ys jagan) మా  అధ్యక్షుడు (maa president) మంచు విష్ణు భేటీ (manchu vishnu) ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా రంగానికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకున్నామన్నారు. తిరుపతిలో ఫిల్మ్ స్టూడియో పెడతానని మంచు విష్ణు సంచలన ప్రకటన చేశారు. సినీ  పరిశ్రమ  రెండు రాష్ట్రాలకు రెండు కళ్లు అన్న ఆయన.. విశాఖకు ఎలా షిఫ్ట్ అవ్వాలి అనే దానిపై ఆలోచిస్తామి విష్ణు తెలిపారు. మా నాన్నను కూడా ప్రభుత్వం ఆహ్వానించిందని.. కానీ కొందరు దానిని మోహన్‌బాబుకు (mohan babu) చేరనివ్వలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆహ్వానం చేరకుండా ఎవరు చేశారో తమకు తెలుసునంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖకు పరిశ్రమ వెళ్లే విషయంపై ప్రభుత్వంతో మాట్లాడుతున్నామన్నారు.  

కాగా.. గతవారం చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం జగన్‌తో భేటీ కావడం పరిశ్రమలోని మరొక వర్గం నొచ్చుకునేలా చేసింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అద్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు, అత్యంత సీనియర్ నటుడు అయిన మోహన్ బాబుకు ఆహ్వానం లేకపోవడం వారిని ఒకింత నిరాశకు గురిచేసింది. చిత్ర పరిశ్రమ నుండి చిరంజీవికి సీఎం జగన్ ప్రత్యేక గౌరవం ఇచ్చినట్లు అయ్యింది. పరిశ్రమకు పెద్ద ఎవరనే చర్చ కొన్నాళ్లుగా కొనసాగుతుండగా.. సీఎంతో భేటీ నేపథ్యంలో చిరంజీవినే అని నిర్ధారించినట్లు అయ్యింది. 

ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీ కూడా చిరంజీవి కంటే మేము ఏం తక్కువ కాదు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని తమ ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చారు. ఇది కొంచెం వివాదాస్పదమైంది.  మిత్రుడైన పేర్ని నాని తన ఇంటికి రావడం కూడా రాజకీయం చేస్తారా అంటూ మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. 

ఈ పరిణామాల అనంతరం మంచు విష్ణు సీఎం జగన్ (Cm Jagan)తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న అధికారిక భేటీనా? లేక పూర్తిగా వ్యక్తిగత భేటీనా? అనేది తెలియాల్సి ఉంది. మంచు విష్ణు ఆయన భార్య తరపు నుండి సీఎం జగన్ కి బంధువులు కూడాను. ఇక ఇంత బిజీ షెడ్యూల్ లో మంచు విష్ణుకు సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం చెప్పుకోదగ్గ విషయం. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?