జగన్‌కు గురువారం సెంటిమెంట్: అన్ని సక్సెస్‌లే

By Siva KodatiFirst Published May 30, 2019, 4:15 PM IST
Highlights

ఏపీ కొత్త సీఎంకు సంబంధించి ఇప్పుడు ఒక కొత్త సెంటిమెంట్ తెర మీదకు వచ్చింది. ఆయనకు గురువారం బాగా కలిసి వస్తోంది. దీనికి తగ్గట్టే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న ముఖ్యమైన ఘటనలు అన్ని గురువారమే జరుగుతున్నాయి

రాజకీయ నాయకుల్లో చాలామందికి వాస్తు, జ్యోతిష్యం, సెంటిమెంట్లు, నమ్మకాలు ఉంటాయి. అక్కడి దాకా ఎందుకు మన పక్కనేవున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇలాంటి సెంటిమెంట్లు ఎక్కువ.

ఆయన తిథి, నక్షత్రం, వారం, వర్జ్యం లేకుండా అడుగు తీసి అడుగు కూడా పెట్టరు. కేవలం వాస్తు బాలేదన్న కారణం చేతనే ఆయన ప్రగతి భవన్ పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేరే క్యాంప్ ఆఫీసు కట్టించుకున్నారు.

వాస్తు ప్రభావం చేతనే ముఖ్యమంత్రిగా సచివాలయంలో అడుగుపెట్టకుండా.. మరోచోట సెక్రటేరియేట్‌ను నిర్మించాలని భావిస్తున్నారు. ఇక ఆయనతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్న నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్‌కు కూడా కొత్తగా సెంటిమెంట్లు వచ్చేలా ఉన్నాయి.

అయితే ఏపీ కొత్త సీఎంకు సంబంధించి ఇప్పుడు ఒక కొత్త సెంటిమెంట్ తెర మీదకు వచ్చింది. ఆయనకు గురువారం బాగా కలిసి వస్తోంది. దీనికి తగ్గట్టే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న ముఖ్యమైన ఘటనలు అన్ని గురువారమే జరుగుతున్నాయి.

అనుకోకుండా జరిగినప్పటికీ గురువారం ఆయనకు లక్కీడేగా మారిపోయింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ మాత్రమే కాదు.. చివరికి ప్రమాణ స్వీకారం కూడా గురువారమే కావటం విశేషం. మరి గురువారం తనకు కలిసి వస్తుందన్న సంగతిని జగన్ గుర్తించారో లేదో.

పోలింగ్: ఏప్రిల్ 11 గురువారం
కౌంటింగ్: మే 23 గురువారం
ప్రమాణ స్వీకారం: మే 30 గురువారం

click me!