సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకొన్న ప్రేమ జంట

Published : Apr 16, 2019, 04:47 PM IST
సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకొన్న ప్రేమ జంట

సారాంశం

తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది. ఆత్మహత్య చేసుకొనే ముందు ఈ ప్రేమికుల జంట సెల్పీ వీడియో రికార్డు చేశారు. పెద్దలు ప్రేమ పెళ్లిళ్లకు అభ్యంతరం చెప్పొద్దని కోరారు.

చిత్తూరు: తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది. ఆత్మహత్య చేసుకొనే ముందు ఈ ప్రేమికుల జంట సెల్పీ వీడియో రికార్డు చేశారు. పెద్దలు ప్రేమ పెళ్లిళ్లకు అభ్యంతరం చెప్పొద్దని కోరారు.

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తికి చెందిన ఓ యువతి, అదే జిల్లాలోని చంద్రగిరి మండలం మొరవపల్లికి చెందిన ధనుంజయలు ప్రేమించుకొంటున్నారు. వీరిద్దరి పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించలేదు.

దీంతో కలిసి జీవించే అవకాశం లేకపోవడంతో  కలిసి చావాలని నిర్ణయం తీసుకొన్నారు. దీంతో మొరవపల్లి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆత్మహత్య చేసుకొనే ముందు వీరిద్దరూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 

అందరికీ ఇక సెలవు అంటూ వీడియో రికార్డు చేశారు. తమను పెద్దలు విడదీస్తున్నారనే బాధతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా వారు తెలిపారు. ప్రేమికులను విడదీయాలని భావించే వారంతా ఈ వీడియోను చూసైనా మారాలని వారు కోరారు. 


 

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu