అంబటి రాంబాబు అల్టిమేటం : స్పీకర్ కోడెలపై కేసు నమోదు

By Nagaraju penumalaFirst Published Apr 16, 2019, 4:34 PM IST
Highlights

కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదు చెయ్యకపోతే నిరాహార దీక్ష చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రంగంలో దిగిన పోలీస్ శాఖ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదు చేసింది. రాజుపాలెం పీఎస్ లో కోడెలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. 

గుంటూరు: ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 11న ఇనిమెట్ల గ్రామంలోని పోలింగ్ బూత్ లో కోడెల శివప్రసాదరావు బీభత్సం సృష్టించారని దాడులకు కారణం ఆయనేనని వైసీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదు చెయ్యకపోతే నిరాహార దీక్ష చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రంగంలో దిగిన పోలీస్ శాఖ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదు చేసింది. 

రాజుపాలెం పీఎస్ లో కోడెలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఇకపోతే ఎన్నికల సమయంలో ఇనిమెట్ల గ్రామంలో 160 నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో హల్ చల్ చేశారు స్పీకర్ కోడెల శివప్రసాదరావు.  

కోడెల తలుపులు వేసుకుని గంటన్నరకు పైగా అక్కడే కూర్చొని ఉన్నారని అది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. పోలింగ్ బూత్ లో తలుపులేసుకుని ఉండటంతో ఓటర్లు కోడెల శివప్రసాదరావుపై తిరుగుబాటుకు దిగారని ఓటర్ల తీరుతో సొమ్ముసిల్లి పడిపోయని కోడెల ఆ తర్వాత దాడి చేశారంటూ తమపై కేసులు బనాయించారంటూ ఆరోపించారు. 

ఇనిమెట్ల ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు పెట్టడాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. ఘటనలో లేని వ్యక్తులు తమపై ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టారని కానీ ఐదుగురు ఏజెంట్లు స్పీకర్ కోడెలపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని వాపోయారు అంబటి రాంబాబు. 

మంగళవారం సాయంత్రంలోగా స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదు చెయ్యకపోతే బుధవారం నుంచి నిరాహార దీక్షకు దిగుతానని అంబటి రాంబాబు హెచ్చరించిన సంగతి తెలిసిందే. 
 

click me!