
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఓ ప్రేమ జంట వ్యవహారం గ్రామంలో ఘర్షణలకు దారి తీసింది. కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి మండలం కోయిలకొండ గ్రామంలో వేర్వేరు కులాలకు చెందిన ప్రేమ జంట పరారైంది. దీంతో రెండు కులాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ప్రేమికుల్లో యువకుడు దళిత సామాజికవర్గానికి చెందినవాడు. దాంతో దళితుల ఇళ్లపై అగ్రకులాలకు చెందినవారు దాడికి దిగారు. పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డోన్ డీఎస్పీ నరసింహా రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
"