విషాదం: జెండా కడుతుండగా కరెంట్ షాక్, ముగ్గురు చిన్నారులు మృతి

Siva Kodati |  
Published : Aug 14, 2019, 08:33 AM IST
విషాదం: జెండా కడుతుండగా కరెంట్ షాక్, ముగ్గురు చిన్నారులు మృతి

సారాంశం

సంతమాగులూరు మండలం కొప్పవరంలోని కోదండరామ స్వామి ఆలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొందరు చిన్నారులు జెండా దిమ్మెలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇనుప రాడ్ పైనున్న విద్యుత్ తీగలకు తగలడంతో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు

ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో ముగ్గురు చిన్నారులు మరణించారు. వివరాల్లోకి వెళితే.. సంతమాగులూరు మండలం కొప్పవరంలోని కోదండరామ స్వామి ఆలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొందరు చిన్నారులు జెండా దిమ్మెలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇనుప రాడ్ పైనున్న విద్యుత్ తీగలకు తగలడంతో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. వీరంతా ఐదో తరగతి విద్యార్ధులుగా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు, విద్యాశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ముగ్గురు బాలల మృతితో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే