ఎన్టీఆర్ జిల్లా: గ్యాస్ సిలిండర్‌‌ల లోడుతో వెళ్తున్న లారీలో మంటలు.. భయాందోళనలో స్థానికులు, హైవేపై ట్రాఫిక్ జాం

Siva Kodati |  
Published : Mar 04, 2023, 09:59 PM IST
ఎన్టీఆర్ జిల్లా: గ్యాస్ సిలిండర్‌‌ల లోడుతో వెళ్తున్న లారీలో మంటలు.. భయాందోళనలో స్థానికులు, హైవేపై ట్రాఫిక్ జాం

సారాంశం

ఎన్టీఆర్ జిల్లాలో గ్యాస్ సిలిండర్‌ లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగడం కలకలం రేపుతోంది. లారీలో గ్యాస్ సిలిండర్ల లోడ్ వుండటంతో పోలీసులు రంగంలోకి దిగి రాకపోకలను నిలిపివేశారు.

ఎన్టీఆర్ జిల్లాలో గ్యాస్ సిలిండర్‌ లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగడం కలకలం రేపుతోంది. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై జగ్గయ్యపేట మండలం అనువంచిపల్లి వద్ద లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే క్షణాల్లోనే లారీ మొత్తం మంటలు వ్యాపించాయి. లారీలో గ్యాస్ సిలిండర్ల లోడ్ వుండటంతో పోలీసులు రంగంలోకి దిగి రాకపోకలను నిలిపివేశారు. దీంతో  విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?