కాంగ్రెసుతో టీడీపీ దోస్తీ: ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నిరసన

By pratap reddyFirst Published Nov 3, 2018, 11:24 AM IST
Highlights

కాంగ్రెసుతో వ్యతిరేకతతోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పొత్తుకు సిద్ధపడి ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారని ఆమె ఆరోపిస్తున్నారు. 

హైదరాబాద్: కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ చేతులు కలపడాన్ని దివంగత ఎన్టీ రామారావు సతీమణి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత లక్ష్మీపార్వతి వ్యతిరేకిస్తున్నారు. ఆ దోస్తీని నిరసిస్తూ ఆమె శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన తెలిపారు. 

కాంగ్రెసుతో టీడీపి పొత్తు వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని, ఎన్టీఆర్ ను చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పెడిచారని ఆమె అన్నారు. నాలుగేళ్లు బిజెపితో అంటకాగి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆమె విమర్శించారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు పార్టీని తాకట్టు పెట్టారని అన్నారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. 

కాంగ్రెసుతో వ్యతిరేకతతోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పొత్తుకు సిద్ధపడి ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారని ఆమె ఆరోపిస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెసుతో కలిసిన నడవడానికి చంద్రబాబు సిద్ధపడ్డారు. ఆయన ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు కూడా చేశారు.  

click me!