తవ్వుతోంది టీడీపీ అవినీతిని కాదు... వైసీపీని పూడ్చిపెట్టడానికి గొయ్యి: జగన్ పై లోకేష్ విసుర్లు

By telugu teamFirst Published Dec 28, 2019, 4:57 PM IST
Highlights

7 నెలలుగా జగన్ తవ్వుతోంది అవినీతిని కాదని, వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని టీడీపీ నేత నారా లోకేష్‌ ట్వీట్టర్ వేదికగా మండిపడ్డారు. ఆధారాలు బయటపెట్టమని అడిగితే జగన్ గారు కాకి లెక్కలు చెబుతున్నారని అన్నారు.  

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. జగన్ ఏ ముహూర్తాన మూడు రాజధానులు అన్నాడో... అది మొదలు అమరావతి ప్రాంత ప్రజలు ముఖ్యంగా రైతులు రోడ్డులేక్కి నిరసనలు తెలియజేస్తున్నారు. 

ఇకపోతే 7 నెలలుగా జగన్ తవ్వుతోంది అవినీతిని కాదని, వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని టీడీపీ నేత నారా లోకేష్‌ ట్వీట్టర్ వేదికగా మండిపడ్డారు. ఆధారాలు బయటపెట్టమని అడిగితే జగన్ గారు కాకి లెక్కలు చెబుతున్నారని అన్నారు.  

ఏడు నెలలుగా గారు తవ్వుతోంది అవినీతి కాదు వైకాపా ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి. ఆధారాలు బయటపెట్టమని అడుగుతుంటే జగన్ గారు అవే పాత కాకి లెక్కలు చెబుతున్నారు. 4,075 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు.(1/3)

— Lokesh Nara (@naralokesh)

4,075 ఎకరాలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారని, ఐదేళ్ల టీడీపీ పాలనలో అమరావతి ప్రాంతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు కేవలం 1170 ఎకరాలని, కేవలం 1100 పైచిలుకు ఎకరాల రెజిస్ట్రేషన్లే అయితే....  మరి 4,075 ఎకరాల ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగిందో. భ్రమల్లో బతుకుతున్న వైసీపీ నాయకులు, ఉపసంఘం మేధావులే వివరించాలని లోకేష్ ఎద్దేవా చేసాడు. 

5 ఏళ్ల టీడీపీ పాలనలో రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు 1170 ఎకరాలు. మరి 4,075 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగిందో భ్రమల్లో బ్రతుకుతున్న వైకాపా నాయకులు, ఉపసంఘం మేధావులు చెప్పాలి.(2/3)

— Lokesh Nara (@naralokesh)

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై న్యాయ విచారణకు తాము సిద్ధమని, గత 7 నెలల కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై న్యాయ విచారణకు వైసీపీ నేతలు సిద్ధమా అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు లోకేష్. 

ఉపసంఘం నివేదికపై ఓపెన్ ఛాలెంజ్. అమరావతిలో జగన్ గారు ఆరోపిస్తున్న ఇన్సైడర్ ట్రేడింగ్ పై జ్యూడిషియల్ ఎంక్వయిరీకి మేము సిద్ధం. అదే సమయంలో గత 7 నెలల కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై జ్యూడిషియల్ ఎంక్వయిరీకి జగన్ గారు సిద్ధమా?(3/3)

— Lokesh Nara (@naralokesh)
click me!