‘హెరిటేజ్’ పేపర్ ఏమైనా వస్తుందా లోకేష్ బాబు

First Published Dec 14, 2016, 12:19 PM IST
Highlights
  • ‘సాక్షి’ చదవడం హానికరమన్న చినబాబు
  • జగన్ తో చర్చకు సిద్ధమని సవాల్

చినబాబు గారు ఏపీ ప్రజలకు అప్పుడే సలహాలిచ్చేస్తున్నారు. తెలుగువారు రోజూ ఏ పేపర్ చదవాలో..ఏ పేపర్ చదవకూడదో ఢంకా బజాయించి చెప్పేస్తున్నారు.

 

బుధవారం యడ్లపాడు మండలం తిమ్మాపురంలో లోకేష్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీకి సమర్థుడైన ముఖ్యమంత్రి ఉన్నారని, సరైన ప్రతిపక్షనేత మాత్రం లేరని వాపోయారు.

 

అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని.. సమయం, స్థలం జగన్ చెబితే అక్కడికే వస్తానని సవాల్ విసిరారు.

 

జగన్‌కు ఆయన పత్రిక సాక్షి కి ఏపీ అభివృద్ధి కనబడదని ఎద్దేవా చేశారు. సాక్షి చదవడం హానికరమని ప్రజలకు సూచించారు. జగన్‌కు రాష్ట్రం గురించి అవగాహన లేదని ఫైర్ అయ్యారు.

 

ఇక రేపటి నుంచి ప్రజలు ఏ కంపెనీ పాలు కొనాలి... ఏ సూపర్ మార్కెట్ లో సరుకులు కొనాలో కూడా చెబుతారేమో..


హెరిటేజ్ వాళ్లవే పాలు.. మిగిలిన వాళ్లవి నీళ్లు అని కూడా తేల్చేస్తారేమో.. వినడానికి తెగులు తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నప్పుడు ఏమైనా అనొచ్చు.

 

‘హెరిటేజ్’ సాక్షిగా కొత్తగా పత్రిక తీసుకొస్తాం దానిలో ఏపీ అభివృద్ధి రంగుల్లో కనిపిస్తుందని అని కూడా అనొచ్చు.

 

అప్పటి వరకు తమ పత్రికలను మాత్రమే చదవండి అని కోరనూ వచ్చు.

 

click me!