మహారాజా ఆస్పత్రి పేరు మార్పు.. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందంటూ లోకేష్ ట్వీట్...

By SumaBala BukkaFirst Published Oct 7, 2022, 1:24 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఆసుపత్రుల పేర్ల మార్పు వివాదాలకు దారి తీస్తోంది. తాజాగా విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మార్చారు.

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. మహనీయులను అవమానించడమే జగన్ పనిగా పెట్టుకున్నారన్నారు. విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి పేరు మార్చి ప్రజల మనోభావాలను దెబ్బ తీశారని అన్నారు. విలువైన భూమిని ఆస్పత్రి కోసం మహారాజా కుటుంబం ఇచ్చిందని నారా లోకేష్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా నిధులు కేటాయించి ఆసుపత్రిని అశోక్గజపతిరాజు అభివృద్ధి చేశారని చెప్పారు. రాత్రికి రాత్రి మహారాజా పేరును తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

కాగా, ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు భవనాల పేరు మార్పు కొనసాగుతుంది. ఇటీవల విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన ప్రభుత్వం తాజాగా విజయనగరంలో ఎంతో ఘన చరిత్ర కలిగిన మహారాజా ఆసుపత్రి పేరును కూడా మార్చేసింది. మహారాజా జిల్లా కేంద్ర ఆసుపత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మార్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విజయనగరం జిల్లా వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

రాష్ట్ర విభజనకు కారకుడు.. ఆంధ్రుల ఓట్లు కావాలా, ఏపీలో అడ్డుకుంటాం: కేసీఆర్‌కు ఆకుల శ్రీనివాస్ హెచ్చరిక

 గురువారం రాత్రి కేంద్ర ఆస్పత్రి  పేరుకు  బదులు ప్రభుత్వ  సర్వజన ఆస్పత్రి దర్శనమిచ్చింది. ఉదయం ఆస్పత్రికి వెళ్లిన రోగులు, ప్రజలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే బోర్డు మార్పేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హేయనైనదిగా అభివర్ణించారు. ఈ విషయం తెలుసుకుని టిడిపి నేతలు కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రజలకు ఎంతో సేవ చేసిన మహారాజా రాజవంశాన్ని అవమానించేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై సెప్టెంబర్ 21న ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ మనస్తాపం చెందారు. తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సరికాదని చెప్పారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం అంత సరైన నిర్ణయం కాదని అన్నారు. దీంతో మనస్తాపంతోనే తాను రాజీనామా చేస్తున్నానన్నారు. ఆ తరువాతి రోజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నా దృష్టిలో హీరో అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. 

దివంగత రాజశేఖర్ రెడ్డి సంస్కారవంతుడు కాబట్టే తెలుగు గంగ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టారని తెలిపారు. సోనియా గాంధీ కేంద్ర మంత్రిని చేస్తానన్నప్పటికీ జగన్ ఓదార్పు యాత్ర చేసి ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు. ‘నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ 151 సీట్లు సాధించిన జగన్ ను నేను ఎందుకు తిట్టాలి?.. జగన్ ను తిట్టి వేరే పార్టీ వాళ్లను పొగడాలా? ఆయన సీఎం అయ్యాక నన్ను గౌరవించారు. అడగకుండానే చైర్మన్ ను చేశారు. జగన్ కచ్చితంగా హీరోనే. ఆనాడు ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే, అందుకు నేను ప్రత్యక్ష సాక్షిని. బాబు హయాంలో గన్నవరం ఎయిర్ పోర్లుకు ఎన్టీఆర్ పేరెందుకు పెట్టలేదు?’ అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రశ్నించారు. 

‘నా రాజీనామా విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నేను స్వరం మార్చలేదు. నాపై విమర్శలు చేసేవారికి ఫోన్ల ద్వారా వివరణ ఇస్తున్నా. యూనివర్సిటీ పేరు మార్పుపై లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు తన సొంత అభిప్రాయం’ అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
పేర్కొన్నారు. 

click me!