(వీడియో)ఏడు ఐటి కంపెనీలను ప్రారంభించిన లోకేశ్

First Published May 3, 2017, 6:15 AM IST
Highlights

ఈ ఏడు కంపెనీలలో 1500 మందికి ఉద్యోగాలు . ఆరు లక్షల   ఉద్యోగాల కల్పన ధ్యేయం - లోకేశ్

 

విజయవాడ సమీపాన ఉన్న  గన్నవరంలోని  మేధా టవర్స్  లో ఏడు సాఫ్ట్ వేర్‌ కంపెనీలు ఈ రోజు ఒకే సారి ప్రారంభమయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్  ఐటీ మంత్రి నారా లోకేశ్‌ ఈ కంపెనీలను ప్రారంభించారు. ఆయన చేతుల మీద జరిగిన తొలి భారీ ప్రారంభం ఇది.

 

చాలా కాలం తర్వాత ఈ ఐటీ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగుల రాకతో మేధా టవర్స్‌ వద్ద సందడి సందడి కనిపించింది.

 

ఏడు కంపెనీల్లో 1500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. అమెరికాకు చెందిన మెస్లోవా, చందూసాఫ్ట్‌, స్పెయిన్‌కు చెందిన గ్రూపో ఆంటోలిన్‌, జర్మనీకి చెందిన ఐఈఎస్‌, ఎంఎన్‌సీ రోటోమేకర్‌, ఇసి సాఫ్ట్‌, యమైహ్‌ ఐటీ కంపెనీలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  రానున్న రెండేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన చెప్పారు.  ఒక్క ఐటి రంగంలోనే లక్ష ఉద్యోగాలు రానున్నాయని ఆయన చెప్పారు.  ఐటి సంస్ధలు ఏర్పాటు ముందకు వారికి ప్రభుత్వం తరుపున మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

 

ఈ కార్యక్రమంలో నీటిపారుదల మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు , న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, అధికారులు పాల్గొన్నారు.

మేధా టవర్స్ లోని రెండస్థుల్లో ఈ కంపెనీల కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

click me!