సోషల్ మీడియా అంటే ‘దేశం’ వణికిపోతోంది

Published : Apr 07, 2017, 01:40 AM ISTUpdated : Mar 24, 2018, 12:11 PM IST
సోషల్ మీడియా అంటే ‘దేశం’ వణికిపోతోంది

సారాంశం

మూడేళ్ళుగా సోషల్ మీడియా గ్రూపులే ప్రభుత్వానికి నిజమైన ప్రతిపక్షంగా పనిచేస్తున్నయ్. ఫిరాయింపులకు మంత్రివర్గంలో చోటు కల్పించటం,  భంగపడ్డ ఆశావహులు తమ పదవులకు రాజీనామాలు చేయటంపైన సోషల్ మీడియా విరుచుకుపడుతోంది.

సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీని నిద్రపోనిస్తున్నట్లు లేదు. అందుకనే సోషల్ మీడియా అంటేనే తండ్రి, కొడుకులు ఉలిక్కిపడుతున్నారు. ఈ విషయం తాజాగా బయటపడింది. ఎందుకంటే, ఐటిమంత్రి, చంద్రబాబునాయుడు పుత్రరత్నం లోకేష్ నోటి ద్వారానే బయటపడింది. సబ్జెక్ట్ ఎంత చిన్నదైనా, పెద్దదైనా తనదైన స్టైల్లో వాయించేస్తోంది కాబట్టే సోషల్ మీడియాను నియంత్రించాలని మంత్రులకు, నేతలకు లోకేష్ గట్టిగా చెప్పారంటేనే ఎంత కలవరపడుతున్నారో అర్ధమైపోతోంది.

సబ్జెక్ట్ ఏదైనా సవాలంటోంది. గడచిన మూడేళ్ళుగా చంద్రబాబునాయడు ప్రభుత్వాన్ని ఊపిరి తిప్పుకోలేనంతగా వెంటాడుతోంది. ప్రభుత్వం చేస్తున్న తప్పొప్పులను, అవినీతి, అక్రమాలను ప్రశ్నించాల్సిన మీడియా, ప్రశ్నిచేందుకే పుట్టిన జనసేన పార్టీ పట్టించుకోకపోయినా సోషల్ మీడియా మాత్రం యమా యాక్టివ్ రోల్ ప్లే చేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వానికి నిజమైన ప్రతిపక్షం సోషల్ మీడియానే.

తాజాగా మంత్రులకు, నేతలకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్లో  సోషల్ మీడియా గురించి ప్రస్తావించారు. సమన్వయ కమిటి సమావేశం సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ,  ప్రభుత్వం గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలు వస్తున్నట్లు వాపోయారు. నెగిటివ్ వార్తలను నియంత్రించాలంటూ సూచించారు. మామూలుగా అయితే తెలుగుదేశంపార్టీ తరపున సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది. పార్టీ గురించి, చంద్రబాబు, లోకేష్ గురించి పాజిటివ్ పబ్లిసిటీ ఇవ్వటం కోసం పార్టీలో ప్రత్యేకంగా ఒ వింగే ఉంది.

పోయిన ఎన్నికల్లో చంద్రబాబుకు ఈ వింగ్ ఏ స్ధాయిలో సేవలు అందించిందో అందరికీ తెలిసిందే. అటువంటిది చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి పార్టీ కోసం పనిచేసే వింగ్ ఎంచేతనో అచేతనమైపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చాలా వరకూ అమలు కాలేదు.  పార్టీకి అనుబంధంగా పనిచేసిన సోషల్ మీడియా దూకుడు తగ్గటానికి బహుశా ఇది కూడా ఒక కారణం అయ్యుంటుంది. దానికితోడు ప్రతిపక్షం తరపున, యువత స్వచ్ఛందగా మొదలుపెట్టిన సోషల్ నెట్ వర్క్ గ్రూపులు వేలల్లో ఉన్నాయి. అవన్నీ ఒక్కసారిగా రెచ్చిపోతున్నాయ్.

మూడేళ్ళుగా సోషల్ మీడియా గ్రూపులే ప్రభుత్వానికి నిజమైన ప్రతిపక్షంగా పనిచేస్తున్నయ్. ఫిరాయింపులకు మంత్రివర్గంలో చోటు కల్పించటం,  భంగపడ్డ ఆశావహులు తమ పదవులకు రాజీనామాలు చేయటంపైన సోషల్ మీడియా విరుచుకుపడుతోంది. మంత్రిపదవులు రాలేదని రాజీనామాలు చేసిన నేతలు రాష్ట్ర సమస్యల పరిష్కారంపై ఏనాడన్నా రాజీనామాలు చేసారా అంటూ నిలదీసింది.  పోలవరం, రాజధాని నిర్మాణం, ప్రత్యేకహోదాపై చంద్రబాబు డిమాండ్లు చేయకపోవటంపై ధ్వజమెత్తుతోంది.

 విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అంశాన్ని చంద్రబాబు పట్టించుకోకపోవటంపైన కూడా సోషల్ మీడియానే నిలదీస్తోంది. ఓటుకునోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబును సోషల్ మీడియానే ఏకిపారేస్తోంది. ఒకటేమిటి అది..ఇది..అని కాకుండా ప్రతీ విషయంపైనా విశ్లేషణాత్మకమైన కథనాలను సోషల్ మీడియా అందిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాకుండా మీడియాను సమర్ధవంతంగా నియంత్రించిన ప్రభుత్వం సోషల్ మీడియాను మాత్రం ఏం చేయలేకపోతోంది. అందుకే టిడిపి ఇపుడు సోషల్ మీడియా అంటేనే వణికిపోతోంది. అందుకే సోషల్ మీడియాను నియంత్రించాలని అనుకుంటోంది. అయినా వారి పిచ్చిగానీ సోషల్ మీడియాను నియంత్రించటం ఎవరి తరం?  

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: చంద్రబాబు, పవన్ పై అంబటి సెటైర్లు | Asianet News Telugu
Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu