మా ఇళ్లు అక్రమ కట్టడం కాదు.. లోకేష్

Published : Jun 26, 2019, 03:01 PM IST
మా ఇళ్లు అక్రమ కట్టడం కాదు.. లోకేష్

సారాంశం

ప్రస్తుతం ఏపీ రాజకీయం  అంతా మాజీ సీఎం చంద్రబాబు నివాసం చుట్టే తిరుగుతోంది. ఏపీలో అక్రమ కట్టడాలు కూల్చివేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం ఏపీ రాజకీయం  అంతా మాజీ సీఎం చంద్రబాబు నివాసం చుట్టే తిరుగుతోంది. ఏపీలో అక్రమ కట్టడాలు కూల్చివేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా...ఈ నేపథ్యంలో... ఇప్పటికే ప్రజా వేదికను కూల్చివేశారు. దీని తర్వాత చంద్రబాబు నివాసాన్ని కూడా కూల్చివేసే అవకాశం ఉందనే వాదనలు వినపడుతున్నాయి.

ప్రజా వేదికలాగానే చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమేనని వైసీపీ నేతలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంపై చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి లోకేశ్ ఓ ఆంగ్ల మీడియాతో స్పందించారు. తాము ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడం కాదంటూ లోకేశ్ ఓ మీడియా సంస్థతో పేర్కొన్నారు. 

కాగా... ఈ కట్టడాల కూల్చివేతపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు తనకు కేటాయించాలని కోరిన ప్రజావేదికను కూల్చడం కక్ష సాధింపేనని టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు.
 

PREV
click me!

Recommended Stories

RK Roja Comments on Chandrababu Super Six: సూపర్ సిక్స్ – సూపర్ ప్లాప్ | Asianet News Telugu
నగరిలోచంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ | RK Roja Sensational Comments on Chandrababu | Asianet News Telugu