
అమరావతి: కాపు నేతలు ఎందుకు చంద్రబాబునాయుడు నివాసంలో జరిగిన సమావేశానికి హాజరుకాలేదో తనకు తెలియదని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు.
బుధవారం నాడు చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.కాకినాడ మీటింగ్ వెళ్లిన వాళ్లలో కొందరు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారని గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. అందరికి ఈ సమావేశానికి రావాలని ఆహ్వానాలు పంపలేదని ఆయన తెలిపారు.
విజయవాడలో ఉండి కూడ కొందరు కాపు నేతలు చంద్రబాబునాయుడు నివాసంలో జరిగిన సమావేశానికి హాజరుకాలేదు. ఈ విషయం తనకు తెలియదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ విషయమై గురువారం నాడు ఏపీ డీజీపీని కలుస్తామన్నారు.
ప్రజావేదికను కూల్చడాన్ని ఆయన తప్పుబట్టారు. అర్ఝరాత్రి పూట ప్రజావేదికను కూలుస్తారా అని ఆయన ప్రశ్నించారు.