
బస్సుల వివాదంపై మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చాలా ఆలస్యంగా స్పందించారు. రవాణాశాఖలోని ఉన్నతాధికారులు బాగా అవినీతిపరులంటూ విజయవాడ ఎంపి కేశినేని నాని సోమవారం చేసిన ఆరోపణలపై పార్టీ, ప్రభుత్వంలో అలజడి మొదలైంది. నాని ఆరోపణలపై రావాణాశాఖ సిబ్బంది మండిపడుతున్నారు.
ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై నాని చేసిన ఆరోపణలను ఈరోజు లోకేష్ ప్రస్తావించారు. ‘ఎవ్వరితోనూ మాట్లాడవద్దం’టూ ఆదేశించారు. బహిరంగ ఆరోపణలతో పార్టీ, ప్రభుత్వ పరువు పోతోందట. అందుకనే ఎక్కడా మాట్లాడవద్దన్నారు. పోర్చుగల్ పర్యటనలో ఉన్న మంత్రి కేశినేనితో మాట్లాడుతూ, తాను విజయవాడకు రాగానే కలిసి మాట్లాడుకుందామని చెప్పారు. అదే సమయంలో తాను చేసిన వ్యాఖ్యలను నాని మంత్రికి వివరించారు. తామిద్దరు మాట్లాడుకున్న తర్వాత విషయాన్ని చంద్రబాబునాయుడుతో చర్చిద్దామని కూడా లోకేష్ చెప్పారు.