విజయవాడ- గుంటూరుల్లో లాక్‌డౌన్ తరహా ఆంక్షలు... సోమవారం నుంచి అమల్లోకి

By Siva KodatiFirst Published Apr 17, 2021, 7:32 PM IST
Highlights

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఈ పరిస్థితుల్లో కృష్ణా- గుంటూరు జిల్లాల్లో ఆంక్షలు విధించింది ప్రభుత్వం. విజయవాడలో ఎగ్జిబిషన్‌కు అనుమతి రద్దు చేసింది. మే 1 వరకు అనుమతులు వున్నా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఈ పరిస్థితుల్లో కృష్ణా- గుంటూరు జిల్లాల్లో ఆంక్షలు విధించింది ప్రభుత్వం. విజయవాడలో ఎగ్జిబిషన్‌కు అనుమతి రద్దు చేసింది. మే 1 వరకు అనుమతులు వున్నా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అలాగే ఆదివారం దుకాణాలు, వాణిజ్య సముదాయాలను మూసివేయాలని విజయవాడలోని వ్యాపార సంస్థలు నిర్ణయించాయి. అటు గుంటూరు జిల్లాలో కూడా కరోనా ఆంక్షలు విధించారు అధికారులు. సోమవారం నుంచి పార్క్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఓపెన్ జిమ్‌లు తెరుచుకోవు.

అలాగే సోమవారం నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే షాపులు తెరవాలని గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. పలు జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్ ప్రకటించారు అక్కడి అధికారులు. విజయనగరం జిల్లా బొబ్బిలి, గుంటూరు జిల్లా దుగ్గిరాల వంటి ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.  

Also Read:ఏపీలో కోవిడ్ విలయతాండవం: ఒక్కరోజులో 7 వేలకు పైగా కేసులు.. చిత్తూరులో విషమం

కాగా, గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 7,224 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 9,55,455కి చేరింది.

కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,388కి చేరింది. వైరస్ వల్ల చిత్తూరులో 4, నెల్లూరు 3, కర్నూలు 2, విశాఖ 2, గుంటూరు, కడప, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

click me!