తాగుబోతులకిచ్చిన వెసులుబాట్లకు కూడా నోచుకోని ఏపీ పేదలు

By team teluguFirst Published Aug 17, 2020, 9:09 AM IST
Highlights

నగదును తీసుకునేందుకు తెల్లవారుజామున నుండి బ్యాంకు వద్దకు  వినియోగదారులు క్యూ లైన్లో నిల్చున్నారు. కరోనా విస్తరిస్తున్న వేళా బ్యాంకు పనివేళలు 11 గంటల వరకు మాత్రమే ఉండడమేమిటని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని బ్యాంక్ ఖాతాదారులు కోరుతున్నారు. 

కరోనా విస్తరిస్తూ కోరలు చాస్తున్న వేళ... బ్యాంకుల వద్ద జనాలు పడిగాపులు కాస్తూ సామాజిక దూరం అనే మాటనే మరిచారు. పేద ప్రజలు ఏం  చేస్తారు పాపం, ప్రభుత్వం ఇచ్చే జగనన్న చేయూత కోసం ఇలా బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. 

బ్యాంకుల వద్ద పడిగాపులు ఎందుకు. తెరిచాక వెళ్లొచ్చు కదా అని అనుకోవచ్చు. కారణం వారు మందుబాబులు కారు. లాక్ డౌన్ వేళ మందుబాబులకు ఇచ్చినంత వెసులుబనాటును కూడా పెద్ద ప్రజలకు ప్రభుత్వం ఇవ్వడంలేదని పలువురు వాపోతున్నారు. 

అసలే కరోనా కష్టకాలం. మార్కెట్లే ముసుగేసాయి. లాక్ డౌన్ వల్ల పనులు దొరకడం కష్టంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే డబ్బన్నా వెళ్లి తెచ్చుకుందామంటే బ్యాంకులకు 11 గంటల వరకు మాత్రమే పనిచేసే వెసులుబాటు కల్పించారు. 

దీనితో నగదును తీసుకునేందుకు తెల్లవారుజామున నుండి బ్యాంకు వద్దకు  వినియోగదారులు క్యూ లైన్లో నిల్చున్నారు. కరోనా విస్తరిస్తున్న వేళా బ్యాంకు పనివేళలు 11 గంటల వరకు మాత్రమే ఉండడమేమిటని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని బ్యాంక్ ఖాతాదారులు కోరుతున్నారు. 

click me!