కరోనా, లాక్‌డౌన్‌ ముగింపుపై లేని స్పష్టత: ఏపీలో స్థానిక ఎన్నికలు మళ్లీ వాయిదా

By Siva KodatiFirst Published May 6, 2020, 7:50 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు మరికొంతకాలం వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ కొనసాగుతుండటం సహా హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణను మరికొంతకాలం వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర  ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు మరికొంతకాలం వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ కొనసాగుతుండటం సహా హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణను మరికొంతకాలం వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర  ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది.

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లు ఏపీ ఎన్నికల కమీషనర్ జస్టిస్ వి.కనగరాజ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, హైకోర్టు రిజిస్ట్రార్‌కు సమాచారాన్ని అందించింది.

Also Read:స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు: నెలలోపు సమాధానం ఇవ్వాలని ఏపీ సర్కార్ కు కోర్టు ఆదేశం

అంతకుముందు కరోనా దృష్ట్యా స్థానిక ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు మార్చి 15న అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించారు. 6 వారాల అనంతరం పరిస్ధితిని సమీక్షించి ఎన్నికల నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

ఆ గడువు ఏప్రిల్ 26తో ముగిసింది. అయితే ప్రభుత్వం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానంలో కనగరాజ్‌ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. అంతకుముందు గ్రామ పంచాయతీ కార్యాలయాలపై వైసీపీ జెండా రంగులతో పోలిన రంగులను మార్చాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Also Read:ఏపీలో కరోనా ఉగ్రరూపం: కొత్తగా 60 పాజిటివ్ కేసులు, 1777కు చేరిన సంఖ్య

ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం తీర్పులో స్పష్టంగా పేర్కొంది. నిర్ణీత గడువులోగా ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం.. రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత, లాక్‌డౌన్ ఇంకా ముగియకపోవడం వంటి కారణాల నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల్ని వాయిదా వేశారు. 

click me!