ఏపీలో ప్రారంభమైన తొలి విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్

By telugu news teamFirst Published Feb 9, 2021, 7:27 AM IST
Highlights

ఇప్పటికే 525 పంచాయతీలు, 12,185 వార్డులు ఏకగ్రీవం కాగా..పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాకు అవకాశం ఉంది. 

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ పంచాయతీ ఎన్నికల్లో 7,506 మంది పోటీ చేస్తున్నారు. 

ఇందులో 20,157 వార్డు సభ్యుల స్థానాలకు 43,601 మంది బరిలో ఉన్నారు. తొలిదశ ఎన్నికల కోసం 29,732 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే 525 పంచాయతీలు, 12,185 వార్డులు ఏకగ్రీవం కాగా..పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాకు అవకాశం ఉంది. ఎన్నికలు మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ జరగనున్నాయి. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు తర్వాత.. ఫలితాలను వెల్లడిస్తారు. ఫలితాల అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది.

click me!