సహజీవనం చేసిన అమ్మాయి వదిలేసి వెళ్లిందని... మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య..

Published : Aug 31, 2021, 10:29 AM ISTUpdated : Aug 31, 2021, 10:52 AM IST
సహజీవనం చేసిన అమ్మాయి వదిలేసి వెళ్లిందని... మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య..

సారాంశం

వారం రోజుల కిందట ఆమె ఇతన్ని వదిలేసి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన శిశశంకరాచారి విషయం తల్లిదండ్రులకు చెప్పి ఆదివారం రాత్రి బయటకు వెళ్లాడు. యువతితో కలిసి ఉన్న ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకున్నాడు.

కర్నూలులోని శరీన్ నగర్ కు చెందిన శిశశంకరాచారి (20) ఆత్మహత్య చేసుకున్నాడు. కార్పెంటర్ పనిచేసే వీరబ్రహ్మయ్యాచారికి కుమారుడు, కుమార్తె సంతానం. కృష్ణగిరి మండలం ఎస్ హెచ్ ఎర్రగుడి స్వగ్రామంకాగా కర్నూలులో స్థిరపడ్డారు. కుమారుడు శివశంకరాచారి కోడుమూరులో ఐటీఐ చదివి తండ్రికి చేదోడుగా ఉండేవాడు. గుంటూరుకు చెందిన అమ్మాయినిి ప్రేమించాడు. ఆమె కర్నూలుకు రావడంతో సమీపంలోనే మరో ిల్లు అద్దెకు తీసుకుని ఆమెతో సహజవనం చేశాడు.

తల్లిదండ్రులు నచ్చజెప్పినా వినకుండా ఆమెతోనే ఉండేవాడు. అయితే ఆమెను పోషించడం భారంగా మారడం, వారం రోజుల కిందట ఆమె ఇతన్ని వదిలేసి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన శిశశంకరాచారి విషయం తల్లిదండ్రులకు చెప్పి ఆదివారం రాత్రి బయటకు వెళ్లాడు. యువతితో కలిసి ఉన్న ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకున్నాడు.

గమనించిన ఇంటి యజమాని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగు చూసింది. ఇఫ్టపడిన అమ్మాయి మోసగించిందన్న బాధతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సోమవారం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు, ఇక అల్లకల్లోలమే..!
Ultra-Modern Bhogapuram Airport: అత్యాధునిక హంగులతో భోగాపురం ఎయిర్ పోర్ట్ చూసారా?| Asianet Telugu