అలా అయితే ప్రాంతీయ విబేధాలు, అందుకే మూడు రాజధానులు: మంత్రి అవంతి శ్రీనివాస్

By narsimha lode  |  First Published Aug 30, 2021, 6:31 PM IST


విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటుపై చంద్రబాబునాయుడు అనుకూలమా, వ్యతిరేకమా  చెప్పాలని మంత్రి అవంతి శ్రీనివాస్ కోరారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ది చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. మూడు రాజధానులకు తాము కట్టుబడి ఉన్నట్టుగా మంత్రి అవంతి శ్రీనివాస్ వివరించారు.


విశాఖపట్టణం: విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ ఏర్పాటుకు చంద్రబాబునాయుడు అనుకూలమా వ్యతిరేకమా తేల్చి చెప్పాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు.ఆదివారం నాడు ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది జరగాలనే ఉద్దేశ్యంతోనే మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు.ఒకే చోట అభివృద్ది కేంద్రీకృతమైతే ప్రాంతీయ విబేధాలు వస్తాయన్నారు. హైదరాబాద్‌లోనే  పెట్టుబడి పెట్టడం వల్ల  రాష్ట్ర విభజనతో నష్టం జరిగిందన్నారు. విశాఖకు అన్ని రాజధాని హంగులు ఉన్నాయని తెలిపారు.

అత్యాశగా విశాఖపట్నం రాజధాని కోరలేదని చెప్పారు.అన్ని అర్హతలు ఉన్నందునే  విశాఖను రాజధాని నగరంగా ప్రకటించామని చెప్పారు. టీడీపీకి విశాఖపట్నంలో ఓట్లు, సీట్లు కావాలి కానీ అభివృద్ధి మాత్రం అవసరం లేదని ఆయన మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పట్టించుకున్నారా అని ఆయన ప్రశ్నించారు.  విశాఖ అభివృద్దికి  తమ పార్టీ కట్టుబడి ఉందని  ఆయన చెప్పారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని గుర్తు చేశారు. 

Latest Videos

click me!