Liquor Scam: మద్యం స్కీమ్‌తో బిగ్‌బాస్‌కు డ్యామేజ్‌.. వారి శాపనార్థాలు తగిలాయా? 

Published : Apr 27, 2025, 08:00 AM IST
Liquor Scam: మద్యం స్కీమ్‌తో బిగ్‌బాస్‌కు డ్యామేజ్‌.. వారి శాపనార్థాలు తగిలాయా? 

సారాంశం

Liquor Scam: ఇష్టమైతే కొనుక్కుని తాగు.. ఉన్నది ఇదే రకం.. చెప్పిందే రేటు.. అని వైసీపీ హయాంలో మద్యం దుకాణాల వద్ద నిర్వాకుల స్లోగన్‌. దీంతో మందుబాబులు అప్పటి సీఎంని బండబూతులు తిడుతూనే మందు తప్పని పరిస్థితుల్లో తాగేవారు. అయితే... సజ్జల సర్కార్‌ మొత్తం చూసుకోవడంతో.. ఇవన్నీ బిగ్‌బాస్‌కి తెలియకపోవచ్చు. కానీ శాపనార్థాలు మాత్రం బిగ్‌బాస్‌కే తగిలాయి. వాస్తవానికి జగన్‌కి చేరాల్సింది చేరిపోతుంది కదా అని..  

ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రస్తుతం హాట్‌ హాట్‌గా నడుస్తోంది. కేసు విచారణ ప్రారంభమైన నాటి నుంచి బిగ్‌బాస్‌ వైపే అందరి చూపు. సిట్‌ విచారణ ఎదుర్కొంటున్న వారిలో ఎవరైనా బాస్‌ ప్రమేయం ఉందని చెప్పేస్తారా అని ఒకటే ఆందోళన. అయితే.. పెద్దోళ్లు ఏ పనిచేసినా.. చేతికి మట్టి అంటకుండా చేస్తారు అన్నట్లు.. సిట్‌ ఎంత విచారించినా బిగ్‌బాస్‌ పేరు చెప్పరు. అధికారులు సైతం అంత లోతుగా విచారణ చేయరు. ఇక ఇవన్నీ పక్కనపెడితే.. గత ప్రభుత్వ హయాంలో మందుబాబుల మనోభావాలు ఏవిధంగా ఉండేవో తెలుసుకుందాం. 

వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త బ్రాండ్‌లు రాష్ట్రంలో లభించేవి. అప్పటి వరకు ఉన్న సరకు ఎక్కడా కంటికి కనిపించేంది కాదు. ఎక్కడో బలిసినోళ్లుతాగే బార్లలో అక్కడక్కడ లభించేంది. ఈక్రమంలో కొత్త బ్రాండ్లకు అలవాటు పడటం మందుబాబులకు తొలుత కాస్త కష్టంగా ఉండేది. అలవాటుపడిన ప్రాణం కదా.. తప్పదు అనుకుని అతి కష్టం మీద గొంతుతడుపుకున్నారు. మరోవైపు ఏ ప్రభుత్వమైనా మద్యం మీద వ్యాపారం చేస్తారు.. కానీ వైసీపీ మాత్రం మద్యం తయారీ దగ్గరి నుంచే వ్యాపారం చేయడం ప్రారంభించింది. 

ఇదేం బ్రాండ్‌ అని అడిగితే.. మేము అమ్మేది ఇలాగే.. ఇష్టమైతే కొనుక్కో.. లేకుంటే వెళ్లిపో.. అంటూ ఎక్సైజ్ పోలీసుల నుంచి విక్రయాలు చేసే షాపు యజమానుల వరకు ఇదే జవాబు. దీంతో మందుబాబులు బూతులు తిడుతూనే మందు సేవించేవారు. మరో విచిత్రం ఏమిటంటే.. గత ప్రభుత్వ హయాంలో అనేక మందు షాపుల వద్ద రాత్రి సమయాల్లో కనీసం లైట్లు కూడా ఉండేవి కాదు. అంతా చీకట్లోనే వ్యాపారం నడిచేది. దీనికి కారణం కూడా అప్పట్లో జే బ్రాండ్లు బయటకు కనిపించకుండా విక్రయించడం కోసమే అని ఆరోపణులు కూడా చాలా వచ్చాయి. ఇక దుకాణంలో అమ్మవాడు.. కొనేవాడికి అసలు మర్యాదే ఇచ్చేవాడే కాదు.. దీంతో మందుబాబులు గట్టిగానే జగన్‌కు శాపనార్థుల పెట్టారని అర్థమవుతోంది. బిగ్‌బాస్ ఓటమి వెనుక మందుబాబుల పాత్ర ప్రధానంగా ఉంది. నాసిరకం మద్యం తాగి అనేక మంది చనిపోయారని టీడీపీ ముందు నుంచే ఆరోపణలు చేస్తోంది. వారి చెప్పిందే నిజమే అయితే.. ఆ మందుబాబుల భార్యలు సైతం వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని అర్థం చేసుకోవచ్చు. 

మద్యం కేసులో ఎంపీ విజయసాయి కీలకం.. 
ఏపీ మద్యం స్కాం గురించి ఎంపీ విజయసాయిరెడ్డికి మొత్తం తెలుసు. కానీ ఇటీవల సిట్ అధికారులు పిలిచి విచారించినప్పుడు తనకు సంబంధం లేదని తాత బుకాయించాడు. కొసమెరుపు ఏంటంటే అతని ఇంట్లోనే స్కాం సిట్టింగ్‌ జరిగిందట.. కానీ తాను మాత్రం కేసులో కీలక వ్యక్తి అయిన కసిరెడ్డికి కేవలం అప్పుగా అల్లుడి నుంచి డబ్బు ఇప్పించానని చెప్పుకొచ్చాడు. కేసులో కసిరెడ్డి పాత్ర ప్రధానంగా ఉందని పోలీసులకు హింట్‌ ఇచ్చాడు. తనకు తెలియదు అని సైలెంట్‌ కాకుండా.. రీసెంట్‌గా కసిరెడ్డిని పోలీసులు విచారిస్తున్న క్రమంలో తన ట్విట్టర్‌ వేదికగా... మద్యం స్కాంలో తనని లాగాలని చూస్తే.. అందరి వివరాలు బయటపెడతానని పరోక్షంగా ఎంపీ మిధున్‌ రెడ్డిని, బిగ్‌బాస్‌ను ఉద్దేశించి పోస్టు చేశారు విజయసాయిరెడ్డి. ఇక త్వరలో ఇంకెన్ని ట్విస్టులు ఈ కేసులో చూడాల్సి వస్తుందో పోలీసులకు, ప్రజలకు అర్థం కావడం లేదు. ఇక వైసీపీ పార్టీలో మాత్రం మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ ప్రతిష్ట దిగజారుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్