ఏపీలో మద్యం సిండికేట్ల మాఫియాకు.. సీఎం జగన్ చెక్

By telugu teamFirst Published Aug 30, 2019, 4:28 PM IST
Highlights

మొత్తంగా మద్యం సిండికేట్ల ఆగడాలకు కళ్లెం పడనుంది. రూ.లక్షలకు లక్షలు వెచ్చిచి తమకు అనుకూలంగా ఉన్నవారిని దారిలోకి తెచ్చుకొని తామనుకున్నది సాధించేందుకు ఎంతకైనా తెగించే రాజకీయ ప్రతినిధుల ఆగడాలు ఇకపై కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఏసీబీ కేసులకు చిక్కి, సీఐడీ కేసుల్లో ఇరుక్కున్న నేతలు బిక్కమొకాలేసుకోవాల్సిందే.

ఇక ఆంధ్రప్రదేశ్ లో మద్యం మాఫియాకు చెక్ పడనుంది. ఇష్టారాజ్యంగా మద్యం బాటిల్లపై రూ.5 నుంచి రూ.10వరకు ఎమ్మార్పీపై అదనపు వసూళ్లు ఇక కుదరవు. దుకాణాలకు దుకాణాలు సిండికేట్ లో కొట్టేసి బెల్ట్ దుకాణాలకు ఇబ్బడి ముబ్బడిగా మద్యం సరఫరా చేసే ప్రక్రియ ఇప్పటికే నిలిచిపోయింది. రూ.కోట్లకు కోట్లు సంపాదించి గత ప్రభుత్వంలో మంత్రులు, పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందికి వాటాలు చెల్లించే ముఠాలకు కాలం చెల్లనుంది.

మొత్తంగా మద్యం సిండికేట్ల ఆగడాలకు కళ్లెం పడనుంది. రూ.లక్షలకు లక్షలు వెచ్చిచి తమకు అనుకూలంగా ఉన్నవారిని దారిలోకి తెచ్చుకొని తామనుకున్నది సాధించేందుకు ఎంతకైనా తెగించే రాజకీయ ప్రతినిధుల ఆగడాలు ఇకపై కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఏసీబీ కేసులకు చిక్కి, సీఐడీ కేసుల్లో ఇరుక్కున్న నేతలు బిక్కమొకాలేసుకోవాల్సిందే.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ చీప్ లిక్కర్ ను మిక్స్ చేసేసి, బాటిళ్లపై మూతల్ని స్థానికంగా తయారు చేయించేసి, ఆదాయం సమకూర్చుకున్నవారికి ఇక బ్రేక్ పడనుంది. గత ప్రభుత్వం హాయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్ లపై ఇన్నాళ్లూ జన ప్రియ పుష్కర గణేష్ సిండికేట్లు డాన్ లుగా ఉండేవి. మద్యం వ్యాపారంపై చాలా వరకు ఎమ్మెల్యే వెలగపూడిదే పైచేయి అయ్యేది. తన అనూయాయులతో అవసరమైతే భౌతిక దాడులకు కూడా తెగబడిన సందర్భాలు ఉన్నాయి.

ఇప్పుడా 30ఏళ్ల చరిత్ర కాలగర్భంలో కలిసిపోనుంది. ఎన్నికల హామీలో భాగంగా దశలవారీ మధ్య నిషేధం అమలు చేసిన ప్రభుత్వం తొలుత మద్యం దుకాణాలను క్రమంగా తగ్గించనుంది. ప్రభుత్వమే మద్యం విక్రయించేందుకు వచ్చే నెల 1న ముహుర్తం ఖరారు చేసింది. అక్టోబర్ 2నాటికి పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో ప్రైవేటు మద్యం వ్యాపారులంతా రాష్ట్రం వదిలి వెళ్లిపోయే పరిస్థితి  దాపురించింది.

‘మద్యపానం ప్రాణానికి హానికరం’ అంటూ కొత్తగా బోర్డులు రానున్నాయి. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న 402 మద్యం దుకాణాల లైసెన్సులకు గడువు ముగిసిపోనుంది. మొన్నటి జూన్ కే గడువు ముగిసినా, కొత్త ప్రభుత్వం రావడం, కొత్త మద్యం  పాలసీ తెరమీదకు రావడంతో పాత లైసెన్సు వ్యవధిని పొడిగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపేలా జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వం తరపున నడవనున్న మద్యం దుకాణాలకు సంబంధించి ఇప్పటికే విధి విధానాలు ఖరారయ్యాయి. జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలో ఇప్పటికే నడుస్తున్న మద్యం దుకాణాల సిబ్బందికి ఉపాధి లభించేలా చేస్తున్నారు. అదే భవనం, ఫర్నీచర్ ను అద్దెకు తీసుకునేలా చర్యలు చేపట్టారు. గ్రామాల్లో మద్యం దుకాణాల్లో ఓ సూపర్ వైజర్, ఇద్దరు సిబ్బంది, ఓ నైట్ వాచ్ మెన్ ఉంటారని, నగరాలు, పట్టనాల్లో ఓ సూపర్ వైజర్ తో పాటు ముగ్గురేసి సేల్స్ మన్, ఓ నైట్ శాచ్ మన్ ఉండాలని చెబుతున్నారు. 

click me!