చంద్రబాబు ఇంటికి మళ్లీ నోటీసులు.. కూల్చివేయడం ఖాయమా..?

By telugu teamFirst Published Sep 21, 2019, 8:58 AM IST
Highlights

జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజా వేదికనే... అవినీతి కట్టడమంటూ కూల్చివేశారు. ప్రజా వేదికను తనకు ఇవ్వాలంటూ చంద్రబాబు కోరినందుకే దానిని కూల్చివేశారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఇది జరిగిన మరుసటి రోజే చంద్రబాబు ఇంటికి కూడా నోటీసులు జారీ చేశారు. 
 

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి  సీఆర్డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. కృష్ణా నది కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమని వైసీపీ ప్రభుత్వం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. గతంలో నోటీసులు జారీ చేసిన సీఆర్డీఏ అధికారులు.. తాజాగా మరోసారి  నోటీసులు జారీ చేశారు.

అది అక్రమ కట్టడం అని తమ పరిశీలనలో తేలిందని.. వారంలోగా… కచ్చితంగా ఖాళీ చేయాలని.. ఇంటి గోడకు నోటీసులు అంటించారు. గతంలో ఇచ్చిన నోటీసుల గురించి కూడా కొత్త నోటీసుల్లో ప్రస్తావించారు. కాగా... పోలవరం కట్టడం అంటే.. తన ఇంటికి నోటీసులు ఇచ్చినంత సులభం కాదని.. చంద్రబాబు వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే మరోసారి నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఈ సారి నోటీసులకు స్పందించకుంటే... ఇంటిని కూల్చివేయం ఖాయని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.... జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజా వేదికనే... అవినీతి కట్టడమంటూ కూల్చివేశారు. ప్రజా వేదికను తనకు ఇవ్వాలంటూ చంద్రబాబు కోరినందుకే దానిని కూల్చివేశారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఇది జరిగిన మరుసటి రోజే చంద్రబాబు ఇంటికి కూడా నోటీసులు జారీ చేశారు. 

అంతేకాదు.. ఇటీవల ఇటీవల కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు.. ఉద్దేశపూర్వకంగా నీటిని ఆపి.. చంద్రబాబు ఇంట్లోకి వరద వచ్చేలా కుట్ర చేశారనే ఆరోపణలు బలంగా వచ్చాయి. నీరు ఇంట్లోకి చేరితే.. కూల్చి వేయడానికి గొప్ప అవకాశం దొరుకుతుందని ప్రభుత్వ వర్గాలు భావించాయి. చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ కెమేరాతో కూడా వీడియోలు చిత్రీకరించారు. దీనిపై పెద్ద రాద్దాంతమే జరిగింది. ఏది ఏమైనా చంద్రబాబు నివాసాన్ని జగన్ ప్రభుత్వం కూల్చివేయం మాత్రం ఖామని అర్థమౌతోంది. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. 

click me!