Weather update: దక్షిణ భారతంలోని పలు ప్రాంతాల్లో సాధారణ చిరుజల్లుల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాక (ఐఎండీ) తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కురుస్తాయనీ, మరో రెండు వానలు పడతాయని తెలిపింది. ఆదివారం పార్వతీపురం మన్యం, శ్రీ సత్యసాయి, అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Andhra Pradesh Rains: మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా దక్షిణ భారతంలోని పలు ప్రాంతాల్లో సాధారణ చిరుజల్లుల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాక (ఐఎండీ) తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కురుస్తాయనీ, మరో రెండు వానలు పడతాయని తెలిపింది. ఆదివారం పార్వతీపురం మన్యం, శ్రీ సత్యసాయి, అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
వాతావరణ నివేదికల ప్రకారం..ఈశాన్య రుతుపవనాలు ప్రస్తుతం దక్షిణ భారతదేశం వైపు వీస్తున్నాయి, ఫలితంగా ఈ ప్రాంతంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నారు. ఆదివారం పార్వతీపురం మన్యం, శ్రీసత్యసాయి, అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం హెచ్చరించారు.
ఇదిలావుండగా, శనివారం రాత్రి కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి చిరుజల్లులు పడ్డాయి. ఆదివారం రాత్రి రాయలసీమలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే, అక్కడక్కడ భారీ వర్షం కూడా పడవచ్చునని చెప్పారు. ప్రస్తుతం బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతున్నదని తెలిపారు.