నా భర్తను అవమానించారు.. టీడీపీ ఉంటే ఎంటీ, ఊడితే ఏంటీ: లక్ష్మీపార్వతి

Siva Kodati |  
Published : Mar 14, 2021, 05:06 PM IST
నా భర్తను అవమానించారు.. టీడీపీ ఉంటే ఎంటీ, ఊడితే ఏంటీ: లక్ష్మీపార్వతి

సారాంశం

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి చెంప పెట్టు అన్నారు ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన కొడుకును వారసుడిగా చేయాలన్న ఆశయం పోయిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి చెంప పెట్టు అన్నారు ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన కొడుకును వారసుడిగా చేయాలన్న ఆశయం పోయిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లాక్కున్న పార్టీని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించుకున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఇప్పుడు టీడీపీని భూస్థాపితం చేశాడని, ఇక తండ్రీ కొడుకులు పాలు, కూరగాయలు అమ్ముకోవాల్సిందేనంటూ ఆమె జోస్యం చెప్పారు. తన భర్తకు చేసిన అవమానం ఇప్పుడు వాళ్లకు వచ్చిందని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు.

సీఎం జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని ఆమె ప్రశంసించారు. నిజమైన ఎన్టీఆర్ అభిమానులైతే ఇకనైనా చంద్రబాబును వదిలేయాలని లక్ష్మీపార్వతి సూచించారు.

Also Read:తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో వైసీపీదే హవా: విపక్షాలకు సింగిల్ డిజిట్లే

టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడం కష్టమంటూ ఆమె వ్యాఖ్యానించారు. మరో 30 ఏళ్లు సీఎం జగన్ ప్రజలకు సేవ చేస్తారని లక్ష్మీపార్వతి జోస్యం చెప్పారు. తన భర్తను అవమానించిన పార్టీ ఉంటే ఏమిటి ఊడితే ఏమిటని ఆమె మండిపడ్డారు.

చంద్రబాబు పని అయిపోయిందని, ఆత్మ విమర్శ చేసుకోవడానికి తన మైండ్ కూడా చెడిపోయిందంటూ లక్ష్మీపార్వతి సెటైర్లు వేశారు. చంద్రబాబు చేసిన పాపాలు తన కొడుకు రూపంలో శాపంగా మారాయని ఆమె విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

He is true Hero! మైనారిటీల కోసం అలుపెరగని పోరాటం | Dr Masthan Basha about Abdul Azeez | Asianet News
Pawan Kalyan Pressmeet: ఢిల్లీలో ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం | Asianet News Telugu