జగన్ సర్కార్ కి ఊరట: ఒడిషా పిటీషన్ ను తిరస్కరించిన వంశధార ట్రిబ్యునల్

By Nagaraju penumalaFirst Published Sep 23, 2019, 3:13 PM IST
Highlights

వంశధార ట్రిబ్యునల్‌. జగన్ సర్కార్ కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను వంశధార ట్రిబ్యునల్‌ సోమవారం తోసిపుచ్చింది. 

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, ఒడిషా ప్రభుత్వాల మధ్య వివాదాస్పదంగా ఉన్న శ్రీకాకుళం జిల్లా నేరేడ్ బ్యారేజీపై కీలక తీర్పు వెల్లడించింది వంశధార ట్రిబ్యునల్‌. జగన్ సర్కార్ కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది.  

శ్రీకాకుళం జిల్లా నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను వంశధార ట్రిబ్యునల్‌ సోమవారం తోసిపుచ్చింది. గతంలో నేరడి బ్యారేజీకి సంబంధించి 106 ఎకరాల్లో ప్రహారీ గోడ కట్టేందుకు జాయింట్‌ సర్వేకు వంశధార ట్రిబ్యునల్‌ అనుమతి ఇచ్చింది. 

అయితే ఆ ఆర్డర్‌లో మార్పులు చేయాలని ఒడిశా ప్రభుత్వం పిటీషన్ వేసింది. అయితే ఆ పిటిషన్‌ను ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. 106 ఎకరాలకు జాయింట్‌ సర్వే నిర్వహించి పూర్తి మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఆదేశించింది. 

సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ మార్గదర్శకత్వంపై నివేదిక చేయాలని ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. బ్యారేజ్‌కు సంబంధించిన పూర్తి ప్రక్రియను డిసెంబర్‌ 30లోగా పూర్తి చేయాలని ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. 

అనంతరం రెండు వారాలపాటు తీర్పును నిలుపుదల చేయాలని ఒడిశా ప్రభుత్వం విజ్ఞప్తిని కూడా వంశధార ట్రిబ్యునల్ తిరస్కరించింది. ఇకపోతే విచారణను జనవరి 10కి వాయిదా వేసింది. 

 

click me!